సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, డిసెంబర్ 2019, మంగళవారం

క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు 2020

కృతఙ్ఞతలు
********
కిరణ పుంజము లద్ది ధరణికి శక్తి ప్ర
సాదించు తరణికి సాగి ప్రణతి
నిలువ నీడ నొసంగి నిలువెల్ల పొదివి సం
రక్షించు పుడమికి  ప్రణతి శతము
జీవమ్ము విరియాడ జేయు పావనమైన
గాలికి మనసా ప్రగాఢ ప్రణతి
త్రాగుట ,  కాహార సాగుకు దాతయౌ
నీటికి ఘనముగా మేటి  ప్రణతి

అక్షయముగా వనరు లిచ్చి , యడు గడుగున
మమ్ము గాచెడి పరమాత్మ కెమ్ములింతు ,
కడు కృతఙ్ఞత జూపించి ,  ఘనత వొగిడి ,
క్రొత్త వత్సర శుభవేళ చిత్త మరసి .

9 కామెంట్‌లు:

  1. మీకున్నూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మాస్టారూ.

    రిప్లయితొలగించండి
  2. నూతన సంవత్సరంలో సోమశిల నిండాలని, నిండు కొండను తలపించే గంగమ్మ పరవళ్లతో మీ కవి హృదయం ఉప్పొంగాలని, అట్లాగే అర్ధాకలితో అలమటించే ముదుసలి నిరుపేదల నాలుగు వేళ్ళు నోటిలో వెళ్లేందుకు మీరు చేస్తున్న యజ్జ్యం నిరంతరంగా అవిఘ్నంగా కొనసాగాలని నా కోరిక.

    మీకు, మీ కుటుంబీకులకు, మీ బ్లాగు వీక్షకులకు, మీ ప్రత్యక్ష & పరోక్ష విద్యార్థులకు, మీ చల్లని చలవతో నాలుగు మెతుకులు తింటున్న అన్నార్తులకు అందరికీ పేరుపేరునా నూతన వర్ష శుభాకాంక్షలు.

    చివరిగా భాష & సంస్కృతి రెంటికీ పురుడు పోసి, పెంపొందించి & కాపాడుకుంటున్న సామాన్యజనులకు, వాటి అధ్యయనం ద్వారా తమ జీవితాలను సార్థకం చేసుకొని తరిస్తున్న పండితులకు ఇరువురికీ క్షేమం కలుగు కాక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "నిండు కొండను" అని పొరపాటున దొర్లింది, "నిండు కుండను"గా సవరించుకొని చదవగలరు. నా టైపో మన్నించండి.

      తొలగించండి
  3. మీ ఆకాంక్షలూ , ఆ భగవంతుని ఆశీస్సులూ కలగలిసి ,అదృష్టం వరించింది . మా సోమశిల నిండింది , గత ఐదేళ్ళుగా మా ప్రాంతానికి పట్టిన దరిద్రం వొదిలింది .
    ధన్యవాదాలు జై గారూ .

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు మాస్టారు,
    పద్యాల బ్లాగులో ఈ రోజు “దండాన్వయం” అనే మాట కనిపించింది. దాని అర్థమేమిటి మాస్టారూ? మా చిన్నప్పుడు క్లాసులో మా తెలుగు మాస్టర్లు కూడా ఈ ప్రక్రియనుపయోగించి పద్యాలు వివరించేవారేమో, కానీ గుర్తు రావడం లేదు (బెత్తంతో కొట్టి చెప్పడం గానీ కాదు గదా 😳😳?)

    రిప్లయితొలగించండి
  5. పెద్దలు శ్రీ నరసింహరావు గారికి నమస్సులు .
    పద్యంలో కర్త కర్మ క్రియ అనే వాక్య నిర్మాణక్రమాన్ని
    పాటిమచరు . వచనంలో ఈ క్రమాన్ని సాధారణంగా
    పాటిస్తారు . పూర్వం తెలుగు ఉపాధ్యాయులు
    పద్యాన్ని పిల్లల కర్థం కావడానికి పద్యంలోని పదాలను
    ప్రోజ్ ఆర్డర్లో పెట్టి బోధించేవారు . దీన్నే దండా
    న్వయం అనేవారు . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  6. అర్థమైంది మాస్టారూ. ధన్యవాదాలు.
    డిగ్రీ కోర్సులో చదివిన షేక్-స్పియర్ గారి నాటకాల్లో కూడా ఇదే ఇబ్బంది పడ్డాము.

    రిప్లయితొలగించండి