సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, డిసెంబర్ 2019, బుధవారం

ఈ వీడియో చూడండి ..... అద్భుతం


ఇది స్పెయిన్ లో ఆ దేశస్తురాలు గానం చేసిన శ్లోకం , వేదం లోది .
మనం ప్రపంచం వైపు చూస్తున్నాం .
ప్రపంచం మనవైపు చూస్తోంది .

అన్నం దేహధారులకవశ్యం .
అన్నం సమకూర్చే దాతను ప్రార్థిస్తూ ..
తండ్రీ ! నాకు ఆరోగ్య ప్రదమైన ,
పుష్టివర్ధనమైన అన్నాన్ని ప్రసాదించు ..
అంటూ , నీవు నాకు సమకూర్చే ప్రసాదాన్ని
కేవలం నేనొక్కణ్ణే కాకుండా
అందరకూ పంచి భుజిస్తాను ..
అని దీక్షబూనడం దీనర్థం .
       ~~~~~
అన్నమె దేహ ధారులకు సాంత మవశ్యము , శక్తినిచ్చుచున్
మిన్నగ దీవెనల్ నొసగు , మేలొనగూర్చెడు నన్నదాత   ! మా
కెన్నగ నిమ్ము భోజనము నింపగు నట్లుగ , నేను మందితో
మన్నన బొంది పంచుకొను మాడ్కి భుజింతును మేల్ దలంచుచున్ .

3 కామెంట్‌లు:

  1. విదేశీయురాలైనా కూడా ఉచ్చారణ దోషరహితంగా చక్కగా ఉంది మాస్టారూ👏.

    రిప్లయితొలగించండి
  2. నిజమే నరసింహరావుగారూ ,
    గతంలో వో సారి మాయింటి కిద్దరమ్మాయిలు
    రష్యా సాఫ్టువేరింజనీర్లు వచ్చేరు . హైద్రబాదులో
    కూచిపూడి నేర్చుకున్నారు లెండి . ముద్దుగారే
    యశోద .... పాట వాళ్ళుపాడి , నన్నడిగి
    ఆంగ్లానువాదం చేయించు కున్నారు . తెలుగు
    రాని వాళ్ళు మనోహరంగా పాడటం , మనోఙ్ఞంగా
    ఆడడం చూచి ... విదేశీయులకు మన కళల పట్ల
    ఆసక్తీ , తపన , అంకితభావం .... మనవాళ్ళ
    కది లేకపోవడం ..... చిత్రంగా ఉంది .
    ఇది కూడా అబ్బురపరచి టపా పెట్టేను .
    ధన్యవాదాలు , నమస్సులూను .

    రిప్లయితొలగించండి
  3. అవును మాస్టారూ. కొంతమంది విదేశీయులు మహా ఆసక్తిగా భారతీయ కళలను అభ్యసి‌స్తారు. ఉదాహరణకు, 1960లు / 1970లలో జాన్ హిగ్గిన్స్ అనే అమెరికన్ దక్షిణ భారతానికి వచ్చి విద్వాంసుల వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుని కచేరీలు చేసే ఎత్తుకు ఎదిగాడు. హిగ్గిన్స్ భాగవతార్ అని పిలిచేవారు. అలాగే శాస్త్రీయ నృత్యం నేర్చుకునే విదేశీయులూ ఎక్కువవుతున్నారు ... మీకు పరిచయమైన ఆ రష్యన్ వనితల్లాగా.

    విదేశీయులు చేసిన నృత్యం విడియో ఒకటి "కస్టేఫలి" శర్మ గారు తన బ్లాగ్-స్పాట్ బ్లాగ్ లో మే 25, 2018న పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. లాట్వియా దేశపు రాజధాని రిగా నగరంలో జరిగింది.

    "దేవుని సేవా నృత్యం"

    http://kasthephali.blogspot.com/2018/05/blog-post_25.html?m=0

    రిప్లయితొలగించండి