సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, ఆగస్టు 2017, గురువారం

ఓం జయ గణేశాయ నమః


కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి

మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు  సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుని  తొలిపూజ చేసి కొలుతు .

6 వ్యాఖ్యలు:

 1. మాస్టారు 🙏.
  గణేశచతుర్ధి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఓం జయ గణేశాయ నమః
  మాస్టారు గారు,
  మీకు మీ కుటుంబసభ్యులకు "వినాయక చవితి" శుభాకాంక్షలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను మూడు కంటే ఎక్కువ గుంజీళ్ళు తీసానండోయ్...హా హా

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారం _/\_
  మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
  తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

  కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు