సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, డిసెంబర్ 2018, శనివారం

వృక్షో రక్షతి ....
వృక్షో రక్షతి ......
--------------
బ్రతు టెన్నాళ్లొ తెలియదు , బ్రతుకు వంద
లాది యేళ్లు వృక్షాలు , ఫలాల నీడ
ల నొసగుచు , నాటిన సుజనుల బ్రతికించి ,
మేలు చేసిన వారికి మేలు సేయు .

 అమ్మవార్ల గుడుల కటుప్రక్క నిటు ప్రక్క
రెండు నూర్ల మ్రొక్క లిరవు గాగ
నాటి పెంచినాను , నయనారవిందాలు
విచ్చు కొనును , చూచు సచ్చరితుల .

వేప కానుగ నేరేడు వెలగ జామ
నిమ్మ  మామిడి యరటి దానిమ్మ  మొదలు
గాగ వృక్షజాతులు , ననేక సుమ తరులు
నాదు జన్మ ధన్యత నొందె నని దలంతు .