సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

తలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు
నిలిచి బ్రంహ్మాండ మంతయు నిండి యున్న
ముగురు తల్లుల శక్తికి మూల మీమె
ఎల్ల లోకములకు తల్లి యీమె యనుచు
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు

వేద విహిత విధి విధాన విరచిత శిఖి
శిఖల జ్వాజ్వల్యమాన రోచిషుల నడుమ
మహిత యాగాగ్ని గుండ సంభవ యగుటను
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

రక్త సింధూర వర్ణంపు  రామణీయ
క , లలిత , మనోఙ్ఞ రూపము  , కనక ఖచిత
మణిమయ కిరీటమున ,  అమ్మ విభవమ్ము
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

పసుపు కుంకుమల  , సుగంధ పరిమళముల
నెల్ల వేళల   మైపూత   లుల్లసిల్ల  ,
దీప ధూపాల తోడ సందీప్త యగుట
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .