సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, జనవరి 2019, శనివారం

మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు


హితులారా ! యీ సంక్రాం
తి తమకు శుభము లొనగూర్చి , త్రిదివసములున్
సుత బంధు తతుల తోడుత
అతిశయ సౌఖ్యాలవాల మై వెలుగొందున్ .

8, జనవరి 2019, మంగళవారం

ముదిమి పైకొన్న .....

అళి నీల శిర సార తళతళల్ ధవళమౌ
నుదుటిపై ముడతలు పొదువు కొనును
కనుచూపు తగ్గును కన్నెడ పైకొను
చెక్కుటద్దమ్ములు చెలువు దప్పు
కాళ్లును సేతులు కీళులు సడలును
నడుము డస్సి నాణ్యము నశించు
ఉదరమ్ము పదపడి యుబ్బి చరించును
తిన్న దరుగని జబ్బు తీవ్రమగును

తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
మనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము ,
ఏ వయస్సున ముచ్చటల్ ఆవయసువి ,
సర్దుకుని మనుటె ఘనము , శాంతి యుతము .