16, జనవరి 2013, బుధవారం

..... బతుకు బండి


చెవి నిల్లు గట్టుక  ’ సెల్ ఫోను ‘ విడువదు
నిద్దుర చెఱుపక  ‘ నెట్టు ‘ విడదు
శ్రీవారు దిట్టక  ’ టీవీలు ‘ విడువరు
పది యడుగుల కైన ‘ బండి ‘ విడదు
పన్నెండు దాటినా ‘ పడకలు ‘  పిలువవు
పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
సంతృప్తి యన్నది సుంత లేదు
 
పనికి రాని ‘ ఇగో ’ లతో బతుకు నిండి
మనసు , దేహము కృతకమై మారి మనిషి
సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .