సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, జనవరి 2013, బుధవారం

..... బతుకు బండి


చెవి నిల్లు గట్టుక  సెల్ ఫోను విడువదు
నిద్దుర చెఱుపక  నెట్టు విడదు
శ్రీవారు దిట్టక  టీవీలు విడువరు
పది యడుగుల కైన బండి విడదు
పన్నెండు దాటినా పడకలు   పిలువవు
పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
సంతృప్తి యన్నది సుంత లేదు
 
పనికి రాని ఇగో లతో బతుకు నిండి
మనసు , దేహము కృతకమై మారి మనిషి
సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .

7 కామెంట్‌లు:

  1. పనికి రాని ‘ ఇగో ’ లతో బతుకు నిండి

    అక్షర సత్యాలు చెప్పేరు

    రిప్లయితొలగించండి
  2. నేటి జీవన విధానం అత్యంత కృతకంగానూ సహజత్వానికి దూరంగానూ ఉంది . ఇప్పటి తరం జీవన మాథుర్యాన్ని కోల్పోతున్నట్లనిపిస్తూ ఉంది శర్మగారూ , ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  3. అనిపించడం కాదు రాజారావు గారు. అది వున్న విషయమే.

    రిప్లయితొలగించండి
  4. అనంత కాల గమనంలో మానవ జీవిత కాలం బహు స్వల్పం .
    అందులో బాల్యమొక్కటే అపురూపం .
    అది కూడా విద్యా వ్యాపారార్పణం .
    యవ్వనంలో పని కోసం , నడి వయస్సులో కుటుంబం కోసం పోరాటం .
    వెనుదిరిగి చూసే టప్పటికి అంతా అయిపోతోంది కథ .
    అయినా ఆగడం లేదు ఆరాటం .
    స్పందించి నందుకు ధన్యవాదములు జ్యోతిరమయి గారూ ,

    రిప్లయితొలగించండి
  5. సర్, వివెకత కల్గిన మీ అక్షరాలు సత్యాలనే పలుకుతాయి. కానీ కాలగమనం లొ అన్నీ కలసిపొయేవే ఇగొ లూ, ఇజాలూ. మీ అక్షరాలకు నా నమస్సులు.

    రిప్లయితొలగించండి
  6. మెరాజ్ గారూ ,
    మీ సహృదయ స్పందనకు ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి