![]() |
ఉగాది శుభాకాంక్షలు |
నేల ననలేసి మొగ్గలు పూలు
పూచి
శోభనానికి సిధ్ధమై చూలు కొఱకు
త్వర పడెడు ముద్దరాలయ్యె –
చెఱకు గడను
దూసి పూదూపు సంధించె ధూర్తు
డెవడొ !
వత్సరము కాది మనోజ్ఞమై వరలు
ప్రకృతి
శోభనము గూర్చె నెవ్వడు ! చూడ వాని
మానసపు కాంక్ష తీరు నేమనగ
వచ్చు !
అద్భుతము గద ! ప్రకృతి ఉగాది యందు
ఒడిసి అతని మనోకాంక్ష
నుర్వి మీది
ఇచటి ప్రకృతి పట్టి బంధించి
నిల్పి
ఏటి కేడాదిగా రమణీయ మగుచు
జయ ఉగాది వసంతమై సాగు గాత !