సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, ఫిబ్రవరి 2019, గురువారం

ఫొటో పద్యంపసుపంచు ముదు రాకుపచ్చ కోక , హరిద్ర
వర్ణంపు రైక  ఠేవలను జూచి
కడు మనోఙ్ఞపు తనూ ఘన విభవపు చిరు
చెమటల కమనీయ సిరులు జూచి
తలమీది మూటపై గల వామ హస్తంబు
కుడిచేత కొడవలి కులుకు జూచి
గనిమపై నలవోక గమకించు గరిత జూ
చి , ప్రకృతి పులకించి చెలువు మించె ,

చుట్టు పట్టుల పచ్చని శోభ లొసగు
చేలు తలలూచె , నందంపు జిలుగు జూచి
వందలాదిగ బ్లాగ్ కవి వరులు మురిసి
పద్యములు గట్టెదరొ యేమొ భావుకులయి .