సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, జనవరి 2013, బుధవారం

వచ్చె నవ వత్సరమ్ము .....


 
 
 
 
వచ్చె నవ వత్సరమ్ము , కావచ్చు నిజము

కాల గణనమ్ము దీనిలో ఘనత యేమి ?

పేద శ్రీమంతు డగున ? దీపించి యెగసి

బడుగు బతుకుల వెన్నెలల్ పరుగులిడున ?



మనిషి స్వార్ధాన్ని కొంతైన మాను కొనున ?

మనిషి మనిషిని దోచుట మాను కొనున ?

మనిషి దుర్మార్గ వర్తన మాను కొనున ?

మనిషి మనిషిని చంపుట మాను కొనున ?



నేతలు వినీతులై తలరాత మారి

దేశ ప్రజలకు శాంతి సందేశ మిడున ?

చదువు పూర్తయి యుద్యోగ విధులు లేని

వారి బతుకులు కొలువుల చేరు వగున ?



కోత లేని పవరు సమ కూరునా ?

లమ్ము పారి రైతన్న పొలాలు పండి

భారతావని కాకలి తీరునా ? ప్ర

భుత్వ పథకాల తీరు ప్రమోద మిడున ?



అగును కారణ మవినీతి యన్నిటికిని

ఓటరులు నీతి మంతులై ఓటు వేసి

నీతి మంతుల నేతల నెన్ను కొనిన

నాటి నవ వత్సరమ్ములు వేడు కగును

10 కామెంట్‌లు:

  1. నా మనసులో మాట చెప్పేరు.

    రిప్లయితొలగించండి
  2. శర్మగారూ ,
    మీరు నిరంతర ప్రజాహితైషులు .
    విశ్వ శ్రేయోభిలాషులు .
    మన భావనలు అత్యంత సన్నిహితాలు .
    అందుకే మీకు నమ:పూర్వక ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  3. సమస్యకు పరిష్కారం కూడా చెప్పారు. ఇప్పుడు కావాల్సింది ఇదేనండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్యోతిర్మయి గారూ ,
      కానీ ఓటర్లు నేతల అవినీతిని పట్టించుకోక పోగా , వాళ్ళ అవినీతి సొమ్ములో భాగం కావాలంటున్నారు . ఈ విచిత్రమైన పరిణామం నుండి ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయవలసిన బాథ్యత మన అందరి మీదా ఉంది .
      స్పందించి నందుకు ధన్యవాదములు .

      తొలగించండి
    2. చైతన్య పరచడానికి మనమేం చెయ్యాలో పెద్దలు మీరే చెప్పండి. మేమంతా మీ వెనుక నడుస్తాం.

      తొలగించండి
  4. జ్యోతిర్మయి గారూ ,
    ఓటు విలువ ఎంత శక్తి మంత మైనదో , చిన్నపాటి తాయిలాలకు ఓటును అమ్మేసుకుంటే ఎంత నష్ట పోతున్నామో జనాలకు అర్థమయ్యే వరకూ, వినే వరకూ ఓపికగా మాథ్యమం ద్వారా చెబుతూ ఉండడమే .

    రిప్లయితొలగించండి