సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, సెప్టెంబర్ 2017, గురువారం

తల్లీ ! దుర్గమ్మా ! వందనాలు .

దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .

తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

1 వ్యాఖ్య:

  1. దుర్గ. దుర్గ ఆర్తిశమని, దుర్గ ఆపత్తి నివారణి దుర్గమఛ్ఛేదిని

    శ్రీమాత్రేనమః

    ప్రత్యుత్తరంతొలగించు