సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

30, సెప్టెంబర్ 2017, శనివారం

విజయదశిమి - నేడు - విజయోస్తు జగతికి .....


చెడుపై కడదాకా యీ
పుడమిని పోరాడి దుర్గ  పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .


చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .


ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని  దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .


మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్


అమ్మ చెప్పినదిది , నమ్మి  తనంతగా
నెవడు పూని  సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి  చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు  వచ్చి దుర్గ .2 వ్యాఖ్యలు:

  1. //చెడుపై పోరాడుటయే పుడమి జనులు దుర్గ గొలిచి పూజించుటగున్//
    👏👏👏👏👏సువర్ణాక్షరాలు.
    దుర్గామాత ఎక్కువగా కోరుకునేది, తక్కువగా అందుకునేది ప్రస్తుతం ఈ పూజయే.

    ప్రత్యుత్తరంతొలగించు