సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

18, అక్టోబర్ 2018, గురువారం

బ్లాగు బందుగులకు విజయదశమి శుభాకాంక్షలు


మా కుల్లూరు
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు  కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస

ములు కనంగను  ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని  మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .6 వ్యాఖ్యలు:

 1. మిత్ర మండలిలోన సుత్రాములై వెల్గు
  విన్నకోట నరస విబుధులకును ,
  హితులలో బహుముఖ స్తుతిమతులగు జిలే
  బీ నామ ముసుగులో వీరులకును ,
  పల్కుదోడుల లోన బాసట యగు బండి
  నాగమల్లీశ ఘన విహితులకును ,
  పరిచయస్తులలోన నరుదైన సోదరి
  స్తవనీయ నీహారిక విదుషుల

  కాయు రారోగ్య సౌభాగ్య దాయి యగుచు ,
  సర్వ కార్య విజయయయి , సకల శుభద
  యై విజయదశమి మిగుల యలరు గాక !
  ఇదె , శుభాకాంక్ష లందింతు హృదయ మలర .


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శుభాకాంక్షలకు ధన్యవాదాలు గురువు గారు.
   మీకు మీ కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు.
   __/\__ ...

   తొలగించు
 2. మీకందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సార్ ,
  మీకును ,
  హృదయ పూర్వక విజయదశమి శుభాకాంక్షలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీకూ మీ కుటుంబసభ్యులకూ, బ్లాగ్ మితృలందరికీ విజయదశమి శుభాకాంక్షలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శుభాకాంక్షలకు ధన్యవాదాలు మాస్టారు.
  మీకు, మీ కుటుంబ సభ్యులకు, తదితర మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు