సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, నవంబర్ 2018, ఆదివారం

కుల్లూరు శివాలయంలో .....


                     ఆహ్వానం                 
              కుల్లూరు శివాలయంలో                                  19/11/2018 న కార్యక్రమాల సమయపాలనం
                        *****
1.మహారుద్రాభిషేకం : ఉదయం 6 నుండి 9 వరకు
2.అల్పాహారం : 9 నుండి 10 వరకు
3. రుద్రయాగం : 10-30 నుండి మద్యాహ్నం 1వరకు
శ్రీ అల్లు . భాస్కర రెడ్డి గారి అథ్వర్యంలో
4 . ఉసిరిపూజ  , కార్తీక వనభోజనాలు :
     మధ్యాహ్నం 1 నుండి 3 వరకు
5 . ప్రవచనాలు : సాయంత్రం 4 నుండి 5 వరకు
6 . చెఱువులో కార్తీక దీపోత్సవం : రాత్రి 5-30 నుండి 6 -30 వరకు
7 . రాత్రి అల్పాహారం : రాత్రి 6 - 30 నుండి
 8 . శివాలయంలో దీపోత్సవం : రాత్రి 6-30 నుండి
 9 . రాత్రి 7 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు .
భరతనాట్య , కూచిపూడి ప్రదర్శనలు
         1 .తోట .పూర్ణసాయి (ఫోటో)
         2 .తిరుమలశెట్టి . ఆముక్త (ఫోటో)
          3 .
తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అన్నమాచార్య
కీర్తనలు ,
ఇంకా ..... అనేక దైవ కార్యక్రమాలు .


25 వ్యాఖ్యలు:

 1. మీరు చేపట్టిన ఈనాటి దైవకార్యం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను 👍🌹🌹🌼🌼🌸🌸.

  ప్రత్యుత్తరంతొలగించు


 2. అల్పాహారము ముగించినాము


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వనభోజనం కూడా చేశారా "జిలేబి" గారూ 😀😀😀?

   తొలగించు

  2. ఇంకా కాలే పొద్దుటి అల్పాహారమే ఎక్కువయ్యె   జిలేబి

   తొలగించు
  3. మీరు వెళ్ళకుండానే వెళ్ళినట్లు వ్యాఖ్యానించడం దేనికీ ? మీరేమైనా మోడీనా ప్రతిచోటుకీ ఎగురుకుంటూ వెళ్ళడానికీ ? మీకెన్ని పనులో ....మత్తేభాలూ, శార్ధూలాలూ, సీసాలూ ఎవరికీ చూపించకుండా వ్రాయాలి కదా ?

   తొలగించు
  4. “జిలేబి” గారి కొంటెతనం గురించి తెలిసుండి కూడా ఇట్లా అడుగుతారేం నీహారిక గారూ 😀? వారు విసిరే చెణుకులను ఆస్వాదించి ఊరుకోవడమే ఉత్తమం 🙂.

   తొలగించు
  5. ఈ కోణంగితనం నేనైతే భరించను. వెళ్ళకపోయినా వెళ్ళినట్లు బిల్డప్ ఇవ్వడం అవమానించడం కాదా ?

   తొలగించు
  6. దైవం విషయంలోనూ పరాచికాలేనా జిలేబీ వారూ ,
   తమంతటి పండితులం కాదు , తమకు చెప్పడానికి ,
   ధన్యవాదాలు .

   తొలగించు
  7. నీహారికగారూ ,
   దైవకార్యం నిర్విఘ్నంగా , ఘనంగా జరిగింది .
   పరమేశ్వరుని ఆశీర్వాదం లభించింది .
   ధన్యవాదాలు .

   తొలగించు
 3. truly missing the event ...
  hoping everything goes well,
  as to your efforts and expectations ...
  __/\__ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మిత్రుల ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు . మా వెంకయ్యస్వామి , మా
  అమ్మవారు వచ్చి నేను తలపెట్టిన దైవకార్యాన్ని దిగ్విజయం గా జరిపించా
  రు . వారికి శతకోటి వందనాలు , కృతఙ్ఞతలు . ప్రతీ అంశం దేని కదే
  సాటి . ఐదూర్ల జనాలంతా శివాలయంలోనే సందడి చేశారు . హైదరాబాద్ , తిరుపతి , నెల్లూరు , వెంకటగిరి ,చెన్నై ,బంగలూరు తదితర అనేక
  ప్రాంతాలనుండి బంధుగులు , స్నేహితులు మొదలుగా అనేకమంది హితైషులు కుటుంబాలు తరలి వచ్చారు . పరమానందాన్ని అనుభవించారు . రాజకీయ నేతలు , ఆథ్యాత్మిక వేత్తలు , ప్రింటు మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా ఆసాంతం సందడి చేశారు . అల్పాహారాలు , మధ్యాన్నభోజనాలు షుమారు రెండు వేలకు పైగా ఆరగించారు . ఫ్లోటింగ్
  ఐదువేలకు పైగా తిరునాళ్ళను తలపించింది . ఇరవైమంది పాకశాస్త్ర ప్రవీణులు రుచికరంగా వండి వడ్డించారు . మహారుద్రాభిషేకం ఆ పరమేశ్వరుడికి అత్యంత వైభవంగా నిర్వహించాము . ప్రాంగణమంతా
  నమశ్శివాయ పంచాక్షరీ మంత్రంతో కైలాసాన్ని తలపించింది . వెయ్యిమంది
  మహిళలు గుడిలో , ఉసిరి , మారేడు , మొదలైన చెట్ల క్రింద కార్తీకదీపాలు వెల్గించి పూజలు చేసుకున్నారు . మేము నిర్వహించిన రుద్రయాగం లో పాల్గొని అశేషజనం పులకించి పోయారు . యఙ్ఞానంతరం
  యఙ్ఞగుండం ప్రదక్షిణం చేస్తూ , సమిథలు ,కర్పూరం , నవధాన్యాలూ ,
  కొబ్బరి గిన్నెలూ గుండంలో సమర్పించడంలో అనూహ్యమైన సంరంభం ఎర్పడింది . కంట్రోల్ చేయడానికి మేము ఒకింత కష్ట పడాల్సి వచ్చింది .
  క్రౌడ్ అంచనాలు మించే టప్పటికి వనభోజనాల వద్ద ఇంచుక వత్తిడికి
  లోనయ్యాము . వచ్చిన యావన్మంది తృప్తిగా భుజించారు . రాత్రి 6 నుండి చెరువులో సిష్టమేటిక్ గా దీపోత్సవం నిర్వహించా ఈ . దాదాపు
  ఎనిమిదొందలమంది పాల్గొన్నారు . ప్రత్యేకత ఏమిటంటే , అరటి దొన్నెల
  లో ఆవునెయ్యి నింపి , వత్తివేసిన ప్రమిదలు అందరికీ మేమే అందించాము .వీటిని నేను ప్రత్యేకంగా చెయ్యించి తెప్పించాను . యఙ్ఞ కుండంలో సమర్పించడానికి ఆవు నెయ్యి , కర్పూరము , సమిథలు మేమే అందరికీ
  అందించచాము . దీపోత్సవం నయనానందకరంగా నిర్వహించాము . మా
  వూరి వారికిది క్రొత్త అనుభవం . పులకించి పోయారు . కూచిపూడి ప్రదర్శ
  నం వీక్షించిన అందరూ మంత్ర ముగ్ధులయ్యారు . వాళ్ళ అభినయం అద్భుతం . ఆముక్త MBBS చదువుతోంది . పూర్ణసాయి CA చేస్తున్నాడు . ఇంతకీ వాళ్ళు మా బిడ్డలే . అందరూ వాళ్ళను ఆశీర్వదించిన వాళ్ళే .
  నిన్నటి ఈ దైవ కార్యక్రమం అచ్చంగా ఖర్చు , నిర్వహణ పరిపూర్ణంగా
  నాదయినప్పటికీ ముందే విన్నవించు కొన్నట్లు దైవం తోడ్పాటు వల్లనే సాధ్య
  మైంది .
  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొబ్బరి "గిన్నెలు" అంటే ఏమిటి రాజారావు మాస్టారూ?
   మా ప్రాంతాల్లో నేనింతకు ముందు వినలేదీ మాట.

   తొలగించు
  2. సార్ ,
   మా ప్రాంతంలో పగులకొట్టిన పచ్చి కొబ్బరి కాయ రెండు భాగాలనూ కొబ్బరి చిప్పలు అనీ , షాపులో కొన్న ఎండు కొబ్బరిని కొబ్బరి గిన్నెలు అనీ
   అంటారు .

   తొలగించు
  3. ధన్యవాదాలు మాస్టారూ.
   చిన్నప్పటి నుండీ అలవాటైన పేరు ఎండుకొబ్బరి చిప్పలు లేదా సింపుల్గా ఎండుకొబ్బరి. (కొబ్బరి కురిడీ అని కూడా అనడం విన్నాను ... బహుశః చిప్పలుగా విడగొట్టక ముందు స్టేజ్ లోనేమో). కానీ మీ ప్రాంతపు పేరు “కొబ్బరి గిన్నెలు” బాగుందనిపిస్తోందే 👌. పచ్చిచిప్పలకు ఎండుచిప్పలకు తేడా తేలికగా తెలుసుకోవడానికి పనికొస్తుంది.

   తొలగించు
 5. I am glad everything went alright. Congratulations for a successful completion.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రామకృష్ణారావు గారూ ధన్యవాదాలు సార్ ,
   దైవకార్యాలూ , ధార్మిక కార్యాలూ నిర్వహించడంలో
   మనస్సు పొందే అనిర్వచనీయ అలౌకికానందం
   అనుభవైకవేద్యం . ఇంతమంది జనాలు ఒకరోజంతా
   నా అభ్యర్ధనం మేరకు దైవ సన్నిధానంలో పరమానందం
   లో గడిపేము . మనో వాక్కాయ కర్మలు పరమేశ్వరుని
   అధీనమైన ఆసమయం వర్ణించ నలవికాదు . అందరి
   ముఖ కమలాలూ అద్భుతమైన వికాసాన్ననుభవించడం
   విస్పష్టంగా గోచరించింది . ఆ ఆనందం ప్రతి ఒక్కరి
   ఉద్విగ్న భరిత వాక్కుల్లో నిన్నటికి కూడా నిలిచి కన్పించిందంటే
   దైవకార్యాల పట్ల మనకుండే నమ్మకం చెక్కుచెదరలేదు .
   మనిషి ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికి వేసారి , ఎక్కడా
   సంతృప్తి కనిపించక తుదకు దైవ సన్నిధిలోనే అంతులేని సంతృ
   ప్తిని అనుభవించడం నేను గమనించాను . ఈ విషయంలో
   మామూలు జనాలు పండితులకు మించిన పండితులుగా నాకు
   కనిపించారు . నిజంగా నేను ధన్యుణ్ణి .

   తొలగించు
 6. ఎంతో వైభవంగా జరిగినట్లుంది రాజారావు మాస్టారూ. వ్యయప్రయాసలకోర్చి ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మీకందరికీ అభినందనలు.

  రెండు మూడు ఫొటోలు కూడా ఇక్కడ పోస్ట్ చేస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నేనైతే పని ఒత్తిడిలో ఫుటోలు , వీడియోల విషయం పట్టించుకోలేదు .
   మా నెల్లూరు జిల్లాకు , అందునా మా మండలంలో వాన జడి పట్టుకుంది . ముందురోజు వరకూ వర్షమే . నిన్నటినుండి మళ్ళీ జడి . ఆ ఒక్క
   రోజు మాత్రమే ప్రకృతి నన్నాశీర్వదించింది . ఈ విషయం ఇక్కడి సందర్శకులు అద్భుతంగా చెప్పుకున్నారు . దైవం అనుకూలించడమంటే ఇదే
   నేమో . మా మనమడు తీసినవి . ఇక్కడ ఉంచేను .

   తొలగించు
  2. ఫొటోలు బాగున్నాయి మాస్టారూ. థాంక్సండి.

   తొలగించు
 7. తిరుమలశెట్టి మా పుట్టింటివారి పేరు. యజ్ఞాలు, యాగాలూ ఎక్కడ తలపెట్టినా విజయవంతమవుతాయి సామాన్యులు చేయలేరు కదా ! ధన్యులు మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు