ఇది దీపావళి , నూనె దీపములు వెల్గించండి , భూమాత ది
వ్య దిదృక్షా సమలంకృతా విభవముల్ వర్థిల్లు , వేవెల్గు లీ
ను , దిగంతాల మనోఙ్ఞతల్ పరచు , ఙ్ఞానాబ్జాలు దీపించు , సం
పద లక్ష్ముల్ మన గుమ్మముల్ నిలుచు , నీ పర్వంబు మోదంబగున్ .
ధరణి పొగచూరి దట్టమై మురికిబారి ,
జీవములు వోయి , విష పవనావశిష్ట
కారణమగు టపాసులు కాల్చవద్దు ,
కోరి చేజేతులా చావు కోరవద్దు .
ఆనంద తుందిలమ్మయి ,
మేనులు పులకింప , నుద్యమించి , కుటుంబా
లూనిక దీపాల నడుమ
పూని నిలిచి , వెలుగు సిరుల భోగింప నగున్ .
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసార్ ,
తొలగించండినమస్సులు , ధన్యవాదాలు .
మాన్యులు లక్కాకులవారికి దీపావళి శుభాకాంక్షలు! మీ దీపావళి సందేశము చాలా బాగున్నదండీ!
రిప్లయితొలగించండిసార్ , ధన్యవాదాలు , నమస్సులు .
తొలగించండిపర్యావరణ హితములు
రిప్లయితొలగించండిపద్యదీప సహితములు
మాస్టరుగారి సుభాషితములు
దీపావళి శుభాకాంక్షలు మాస్టారూ 🙏
సార్ , ధన్యవాదాలు .
తొలగించండిభ్రాతృవిదియ పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిభోజనానికి అన్నను పిలిచినట్లే భావించమంటారా ?
తొలగించండిఐతే , తగిన బహుమతి కూడా ఎంపిక చేసుకోండి ,
ముందుగా మంగళాశీర్వచనాలు .
భోజనం తర్వాతే బహుమతి, సమయం వచ్చినపుడు తప్పక రావాలి, ముందుగానే మాట ఇచ్చారు కాబట్టి (సూర్యవంశం)తప్పకూడదు మరి...మీ ఆశీర్వాదం ప్రస్తుతానికి చాలు ధన్యవాదాలు.
తొలగించండి