సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మహా శివ రాత్రి శుభాకాంక్షలు
తలమీద గంగమ్మ తనువులో గౌరమ్మ 
ఇద్దరు చెలువల ముద్దు మగడు 

ఒల్లంత బూడిద వల్లకాడే యిల్లు 
పాములతో దిరుగు సాములోరు 

ఏనుగు తోల్గట్టి యెద్దు వాహనమెక్కి 
లోకాలనేలు భూలోక విభుడు 

డమరుక నాదాలు డప్పుల మోతలు 
శూలాల కోలాహలాల ప్రియుడు

అతడె హరహర మహదేవు డందరికిని 
సులభు డభయమ్ము పొందగా నిల వెలసిన 
లింగ రూపుడు మనల పాలించు ప్రభుడు 
ప్రణతు లర్పింతు నర్చింతు పరమ శివుని .

                                              2 వ్యాఖ్యలు:

  1. జీవులను భూతగణాలనుంచి రక్షించడానికి శ్మశానవాసం చేస్తున్న దయాళువు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నిజమే మీరన్నది . పరమ శివుడు బడుగుల దేవుడు . సమస్త జీవులకు సన్నిహితుడు .
    ధన్యవాదములు , శర్మ గారూ ,

    ప్రత్యుత్తరంతొలగించు