రాష్ట్రాలు రెండైనై
తెలుగు నేతల వెలుగు
రెండింతలైంది
రెండు చోట్లా మొదులైంది
నేతల హడావుడి -
అబ్బే ,
పదవుల కోసం కాదు
ప్రజా సేవ కోసం
నిఝ్ఝంగా నిజం
ఇద్దరు ముఖ్య
మంత్రులొస్తారు
ఇద్దరు పీసీసీ
ప్రెసిడెంట్లొస్తారు
డజన్లకొద్దీ
మంత్రులొస్తారు -
రెన్నెళ్ళల్లో ఎలక్షన్లు
ఆగలేరా అందాకా -
అబ్బే ,
పదవుల కోసం కాదు
ప్రజా సేవ కోసం .
ఆగరు గాక ఆగరు
ఆగితే ,
ఆగబాగమై పోతాము
ప్రజా సేవ లేక -
రైతు వ్యవసాయం చెయ్యలేడు
రైతు కూలీకి పని దొరకదు
తాపీ మేస్త్రీ తటపటాయిస్తాడు
కార్యాలయాలు కకావికలై
పోతాయి
గుమాస్తాల గుడ్లు
తేలిపోతాయి
బళ్ళు బజారున పడతాయి
రవాణా రహదారి తప్పుతుంది
అందరూ అన్నం తినడం
మానేస్తారు
అంతా అస్త వ్యస్త మౌతుంది
ప్రజా సేవ లేక -
అబ్బే ,
పదవుల కోసం కానే కాదు
ప్రజా సేవ కోసం .
పెజాసేవ సెయ్యకపోతే ఎలాగో సెగెట్రీ! ఈయనేటి ఇలా మాటాడతాడు. అయ్యా అదీ సంగతి. అందుకే తహతహ.
రిప్లయితొలగించండిరాజకీయ నాయకుడు కేన్సర్ కంటే ప్రమాదం - అని ఊరకనే అన్నారా మరి ?
రిప్లయితొలగించండిధన్యవాదములు , శర్మగారూ!