సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, జులై 2016, మంగళవారం

భాష జనుల కొరకు. ....

జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి  తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!

ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
పండితుల మెదళ్ళ పైన కాదు,
ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
జీవ గుళిక  , గొప్ప చేవ కలది .

16 వ్యాఖ్యలు:

 1. అమ్మ మొగుడందాం తప్పేటీ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జనంలో ఎవ్వరూ నాన్నను అలా అన్న వారు లేరు,మీరు పిలుచుకుంటానంటే తమ ఘనతను కీర్తిస్తాను .
  దేముడు అనే పదం బూతూ కాదు , పైత్యమూ కాదు. దేవుడు అనే పదానికి పర్యాయంగా నెల్లూరు, కడప ఇంకా చాలా జిల్లాల్లో జనం వాడుకలో ఉంది . ఎరుక లేనందున వ్రాయగా దిద్దేనంటాడాయన . పైగా జనం వాడుకలో లేదంటాడు .
  భాష సృష్టికర్తలు జనం . పండితులు కాదు . భాష
  మాట్లాడే జనం నాల్కల మీద బ్రతికుంటుంది .
  పండితుల మెదళ్ళలో కాదు .
  తెలుగు మాట్లాడే వాళ్లంతా ఎరుక లేని వాళ్లూ కాదు . బూతులే మాట్లాడుతూ కూర్చోడం లేదు .
  ' దేవుడు అనే పదానికి పర్యాయంగా కొన్ని చోట్ల
  దేముడు అనే వ్యవహారం కూడా ఉండొచ్చు .
  ఐతే , అది దేవుడు అనే పదం నుండి ఏర్పడిందే కదా! దేవుడు అని రాస్తే బాగుంటుంది ' అని మర్యాదగా, సున్నితంగా కూడా చెప్పొచ్చు . కానీ, ఇది తప్పు , ఇలానే ఉండాలి అని శాసించడాన్ని
  పండితాహంకారమంటారు .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇలానే ఉండాలి అని శాసించడాన్ని పండితాహంకారమంటారు .

   Well said !

   తొలగించు
  2. పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కూడా దేముడు అనవద్దు దేవుడు అని అనమని చెప్పారు.యండమూరి గారు ఒక నవలలో ఇదే విషయాన్ని వ్రాసారు. దేవుడు అని అనాలని తెలియని వారికి తెలియపరిచారు అంతే కానీ తెలిసినవారు కావాలని తప్పుగా వ్రాయరు కదా ?

   తొలగించు
  3. వాడుకలో పదాలు మార్ఫుకు లోనగుట సహజం. దీన్ని భాషాపరిణామమంటారు. అసలు దేముడు అనే మాట వాడుకలోనే లేదన్నాడే, దాన్ని విభేదించాను. ఎవ్వరైనా తాము సర్వఙ్ఞుల మనుకోవడం అఙ్ఞానమని తెలుసుకుంటే మంచిది. అలాగే భాషా విషయంలో ఒక్కొక్కరి పంథా ఒక్కో రకం . ఈ పదం అసదు, ఈ పదం గ్రామ్యం, జనవాడుకపదాలు రాతలో వాడరాదు. అనే వాళ్లకు
   అనేక నమస్సులు. అసలు భాషకు పరమ ప్రయోజనం జన వ్యవహారము. తతిమ్మా వ్యాసంగాలన్నీ ఆనుషంగిగాలు.

   తొలగించు
  4. >అసలు దేముడు అనే మాట వాడుకలోనే లేదన్నాడే, దాన్ని విభేదించాను.

   __/\__

   ఇలా ఏకవచనప్రయోగాలకు దిగటం మీకు శోభస్కరమేమో తెలియదు కాని ఇంక మిమ్మల్ని ఉపేక్షించి ఊరకొనటమే నాకు శోభస్కరం అని భావిస్తున్నాను. సెలవు.

   తొలగించు
 3. పల్లెల్లో పుట్టి పెరిగి
  పల్లెల ప్రాంతీయ తత్త్వ బహు సహజత్వం
  బుల్లంబున పాదుకొనెను,
  నెల్లూరు పలుకు బడులు నెలకొను కతనన్ -

  అన్నా శ్యామల రాయా!
  పన్నుగ నేకవచనమున పలుకుబడి విథం
  బన్నది మా పలుకు తీరు
  ఉన్నది ఉన్నట్లు పలుక ఉలుకేలయ్యా!

  తెచ్చి పెట్టుకున్న తెగగౌరవము కన్న
  ప్రేమ లూరు పిలుపు పేర్మి గాదె!
  అన్న యనుటకన్ప ఆత్మీయ బంధమ్ము
  గారు గీరనుటలొ కాంచ గలమె?

  ప్రత్యుత్తరంతొలగించు

 4. సెభాసు లెక్కాకుల కవిరాయా !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. జిలేబీ లక్కాకుల కవ్యుద్ఘద్వయానికి,
  చిన్నప్పుడు, అంటే మరీ చిన్నప్పుడు కాదు,నూనూగు మీసాల వయసులో "రాజాధిరాజు" సినిమా చూశాను.రామభక్తుడు బాపు గారు క్రైస్తవ మత వాతావరణం బాగా దట్టించి చూపించిన సినిమా!ఈయన లాంటి హాస్యబ్రహ్మ మార్క్శు ట్వెయిను గారు కొంచెం వ్యంగ్యాన్నీ కొంచెం ఘాటునీ కలిపి రాసిన విచిత్రవ్యక్తి నవల ఆధారం దానికి.అందులో నైతాసు నూతన్ ప్రసాద్ "మీ ద్యాముడు!" అని వెక్కిరింతగా అంటూ ఉంటాడు.ఎప్పుడు నేను "దేముడు" అనే మాట విన్నా అదే గుర్తుకొస్తూ ఉంటుంది అదే ఇబ్బంది!

  భాషకి ఉచ్చారణ ఇంపుగా ఉండటం ప్రధానం అనుకుంటే "దేముడు" అనే పదం అంత వినసొంపుగా ఉండట్లేదనీ నా బాధ!శ్యామలీయానికి బెత్తం మాస్టారు బిరుదు ఇచ్చ్గేసి ఆయన వద్దన్నాడు గాబట్టి మరింత పట్టుదలగా చెయ్యాలా!

  పల్లెల్లో మాట్లాడుకునేటప్పుడు,పిలుపుల్లో "రాముడూ!" కూడా "రావుడూ!" అవుతుంది,గమనించారా?అయితే "రాముడు మా దేముడు" అని కలిపినప్పుడు బాగా ఉంటుందని నేనూ ఒప్పుకుంటాను,విడిగా వాడినప్పుడు మాత్రం ఆ మాట అంత సొంపుగా వినబడట్లేదు.
  స్వస్తి!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కవ్యుద్ధద్వయముల బాం
  ధవ్యపు సాటి హరిబాబు దమ్ములు గూడన్
  దివ్యమగువారి బ్లాగూ
  భవ్యము కింగులకు కింగు భళిరా జూడన్ :)


  మీకు యిదే జిలేబి కితాబు :)

  లక్కాకుల వారూ యిచ్చెదరు తగు సంభావన మీకున్ :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 7. 'తిక్కకు' కుదురేమున్నది?
  'లక్కాకుల' ఇంటిపేరు 'రంథి' ముదరగా
  'వక్కాకు'లనుచు వ్రాసిరి ,
  'మ్రొక్కంగా' బుద్ధి బుట్టె 'బుధుల' కాళ్ళకున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. 'తిక్కకు' కుదురేమున్నది?
  'లక్కాకుల' ఇంటిపేరు 'రంథి' ముదరగా
  'వక్కాకు'లనుచు వ్రాసిరి ,
  'మ్రొక్కంగా' బుద్ధి బుట్టె 'బుధుల' కాళ్ళకున్.

  ప్రత్యుత్తరంతొలగించు