గురు పూర్ణిమ శుభ దినమున
గురు పీఠమునందు నిలిచి గురు మార్గమునన్
వరలు గురుల పాదములకు
మరి మరి మ్రొక్కెద పడిపడి మది శాంతింపన్ .
మత్సరాలు వదలి మనుజ కళ్యాణంబు
గోరు వారె గురులు , కోరి కోరి
తగవులందు జక్కి తన్నుకు జచ్చెడి
గురులు గురులు గారు కూళ లరయ .
కాషాయ వస్త్రాలు గట్టిన మాత్రాన
వక్ర బుధ్ధి గలుగు వాడు గురుడె ?
వేదాది విజ్ఞాన వేద్యుడయ్యును తాను
మోసాన చరియించ బుధుడు గురుడె ?
భాగవతాది ప్రవచనాలు జెప్పినా
సమభావనలు లేని జనుడు గురుడె ?
తగ హిమాలయముల తపమాచరించినా
మనసు కట్టడి లేని మనిషి గురుడె ?
వస్త్ర , ఙ్ఞాన , తప , ప్రవచనాది గొప్పలు
గురుతు లగున పరమ గురువునకును ?
సకల మనుజులందు సమభావమును జూపి
తీర్చి దిద్దు వాడె దివ్య గురుడు .
కృష్ణ పరమాత్మ విశ్వానికే గురుండు ,
గురువుల గురువు వ్యాసుండు పరమ గురుడు ,
సాయినాధుండు భక్తుల సద్గురుండు
చేతులారంగ వీరికి జోత లిడుదు .
గురు పీఠమునందు నిలిచి గురు మార్గమునన్
వరలు గురుల పాదములకు
మరి మరి మ్రొక్కెద పడిపడి మది శాంతింపన్ .
మత్సరాలు వదలి మనుజ కళ్యాణంబు
గోరు వారె గురులు , కోరి కోరి
తగవులందు జక్కి తన్నుకు జచ్చెడి
గురులు గురులు గారు కూళ లరయ .
కాషాయ వస్త్రాలు గట్టిన మాత్రాన
వక్ర బుధ్ధి గలుగు వాడు గురుడె ?
వేదాది విజ్ఞాన వేద్యుడయ్యును తాను
మోసాన చరియించ బుధుడు గురుడె ?
భాగవతాది ప్రవచనాలు జెప్పినా
సమభావనలు లేని జనుడు గురుడె ?
తగ హిమాలయముల తపమాచరించినా
మనసు కట్టడి లేని మనిషి గురుడె ?
వస్త్ర , ఙ్ఞాన , తప , ప్రవచనాది గొప్పలు
గురుతు లగున పరమ గురువునకును ?
సకల మనుజులందు సమభావమును జూపి
తీర్చి దిద్దు వాడె దివ్య గురుడు .
కృష్ణ పరమాత్మ విశ్వానికే గురుండు ,
గురువుల గురువు వ్యాసుండు పరమ గురుడు ,
సాయినాధుండు భక్తుల సద్గురుండు
చేతులారంగ వీరికి జోత లిడుదు .
రిప్లయితొలగించండిశ్రీగురు లక్కాకుల కవి
బాగగు పద్యము జిలేబి పౌర్ణిమ దినమున్
వేగిర చదివెను వందన
మా కవికిడెనిట గురువుల మహిమను గాంచన్
జిలేబి
వందే కృష్ణ జగద్గురుమ్మని మనో వాక్కాయ కర్మంబులన్
రిప్లయితొలగించండిస్పందిస్తున్నది లోకమంతయును విప్పారంగ ఙ్ఞానాబ్జముల్
మందుల్ కుంచిత బుధ్ధులై పగలె కామ్యంబంచు మూర్ఖస్థితిన్
చిందుల్ త్రొక్కెద రట్టి వారికి మనో శ్రేయమ్ము ప్రార్థించెదన్.
ముప్పదియెన్మిదేండ్లు తలపున్ బడి పిల్లల చుట్టు నిల్పి - ఆ
ముప్పిరిగొల్పు స్వచ్చతల ముద్దుల మాటలు విన్న నాకు, నీ
డప్పుల మ్రోత లిప్పు డిటు డాయగ వచ్చె, ప్రచార పర్వమే
గొప్పది గాదుగా! నిజమె గొప్పది, కాంచగ దైవముండెడున్.
కుక్క లఙ్ఞాత లయ్యెనా? అక్కజముగ
రిప్లయితొలగించండికోరి అఙ్ఞాతలే కుక్కలైర? దెలియ,
చదువు కున్నోళ్ళు కుక్కలై చాటు మాటు
చవట వ్యాఖ్యలు బెట్టుట చదువు మహిమ?