నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
వందనీయ విద్యాదేవికి వంద వందనాలు!
రిప్లయితొలగించండిపాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
తొలగించండిహంస నెక్కి తిరుగు నజుని రాణి
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మనల గాచు గాత ! మంజు వాణి .
ధన్యవాదములు .
dear sir very good blog and very good telugu content
రిప్లయితొలగించండిLatest Telugu News
nice content and good article
రిప్లయితొలగించండిhttps://youtu.be/2uZRoa1eziA
plz watch our channel