సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జనవరి 2016, శుక్రవారం

ఆనాటి పెద్ద పండుగ ....భూమి హేమంత ఋతు రాజ్ఞి ప్రేమ బంధ
నాలు వీడి , సూర్యుని కవోష్ణ రుచిర పరి
ష్వంగ సుఖము కోరంగ ప్రయాణ మిద్ది ,
పుడమికి మకర సంక్రాంతి పుణ్యదినము .

గతము కళ్ళ ముందు కదిలాడు చున్నది ,
నిన్న జరిగినట్లు నేటికిన్ని ,
పెద్ద పండుగన్న పెద్దపండుగె మరి ,
పొంగు పొంగలి హృదయంగమమ్ము .

అన్నదమ్ముళ్ళు , భార్యలు , అమ్మ నాన్న ,
పిల్లలు , ముసలోళ్లు మరియు పెళ్ళికాని
తమ్ములును చిన్నచెల్లెల్లు , తడవ తడవ
కలిసి జీవించు చుట్టపక్కాలు గలుగ ,

నిండు పెద్ద కుటుంబాలు , పండుగలకు
తడిసి మోపెడు ఖర్చులు , దారి లేదు ,
తలకొక జతైన బట్టలు తప్పని సరి ,
పిండి వంటలు మస్తుగా నుండవలయు .

భూమిని నమ్మిన రోజులు ,
రామునిపై నమ్మకమున రాజిలు రోజుల్ ,
తామింత దిని ఘనమ్ముగ
ప్రేమమ్మున నొకరికింత పెట్టెడు రోజుల్ .

6 వ్యాఖ్యలు:

 1. లేవింక అట్టి రోజులు, రానే రావింక...

  ప్రత్యుత్తరంతొలగించు

 2. లక్కాకుల వారి కి సంక్రాంతి శుభాకాంక్ష లతో !

  పెద్ద పండుగ ఎల్లెప్పుడూ పెద్ద పండుగే !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ నాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిలా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదములు సార్ ,

   ప్రేమ బంధనాల పెద్దలు పిన్నలు
   గంపెడున్న యిళ్ళ కళలు వేరు ,
   ఒక్కరిద్దరున్న ఒంటరి లోగిళ్ళు
   పండుగ కళలేమి పరచు కొనవు .

   తొలగించు