సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, జనవరి 2016, గురువారం

తులసి వనాలా ..... ?



కోమల జల స్రోతస్విని
గ్రామీణ తెలుంగు , సదరు లలిత పదాలన్
ధీమమ్మున వెలయించిరి
వేమన్నయు అన్నమయ్య వేడుక కల్గన్ .

పిడికెడు మంది ప్రబుధ్ధులు
పడి పడి తలలూచు కొఱక పద్యపుశోభల్ ?
నడయాడ వలద , తెలుగుల
నడివీధుల , నాల్గుదెసల నాట్యపు హేలల్ .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
బ్లాగు తనదటంచు పలికి , యొకడు
తెలుగు గ్రామీణుల తేట పదాలున్న
పద్యము ప్రకటించ  వద్దనియెను .

తనది తులసి వనము , తాకరాదనెనొక్క
యాచకుండు , భజన మేచకుండు
వారు వీరు జేరి వర్థిల్ల జేతురా ?
స్వార్థపరులు తెలుగుభాష నకట !

మహితాత్ములు పూర్వకవులు
మహనీయ గుణాలవాల మాన్యులు , వీరో ?
బహు నీచ మనో లాలస
మహితాత్ములు విడువరెపుడు మాలిన్యములన్ .

2 కామెంట్‌లు:

  1. పద్యాలు బాగున్నాయి సార్. అంత కోపమెందుకుసార్. పాపం క్షమించెయ్యండి. ఎంతైనా పెద్దసార్ కూడా పండితులేగదా.

    రిప్లయితొలగించండి
  2. 'తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు'
    పండితులను గూర్చి పద్యమిదియ ,
    అన్ని మాకె దెలియునన్న యహంకార
    మెన్నడు విడువరు , క్షమించ గలమ ?

    - ధన్యవాదాలు సార్ ,

    రిప్లయితొలగించండి