క్రీస్తు శకము నందు ప్రస్తుత మ్మింకొక్క
క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె ,
మనిషి బ్రతుకు నందు మార్పులేవైపుకో ?
మంచివైపు కగున
ఇంచుకైన ?
భూమికావల నెక్కడో పుడమి బోలు
పుడమి కోసము గాలించు బుధులు ! ‘ సగము
కూటి కేడ్చెద రిచట ‘ ఆకొన్న జనుల
గూర్చి బాగోగు లరయరా ? కొంచమేని .
గతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
మయ్యె గాని
, సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె
అన్నింట మాన్యత గద !
తెలుగు రాష్ట్రాలు రెండయ్యె , చెలగి యందు
ఒకటి స్వర్ణాంధ్ర యయ్యె , ఇంకొకటి యిదిగొ !
కనుడు! బంగారు మయమయ్యె , కరువు బట్టి
రైతు చచ్చెను మృత్యు కోరలకు జిక్కి .
ధరవరలు పెరిగి బతుకు దారుణమయి
సగటు జీవులు కడగండ్ల బొగులుచుండ ,
పట్ట వేలిన వారికి ప్రజల పాట్లు
ఏటి కేడాది మారిన నేమి యొరుగు ?
రిప్లయితొలగించండిమరీ ఇంత నైరాశ్యమా లక్కాకుల వారు ? చీర్ అప్ !
ఆశా వాదికి లేనిదంటూ లేదు !
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
జిలేబి
ఇది నైరాశ్యము కానే కాదు . ఒక్క పూట కూడా కడుపు నిండని కోట్లాది మందిని గూర్చిన ఆలోచన , ఆవేదన . ప్రజా సేవలో తరించిపోయే అవినీతి మయ రాజనీతిని చూచి కసి .
తొలగించండిఆంగ్ల నూతనవత్సరాది శుభకామనలు.
రిప్లయితొలగించండిఆశావాదులం కదా! మార్పు చూద్దామనుకుందాం!! ఎవరిలోనో మార్పురావాలనుకునేవారు తమలో మార్పు తెచ్చుకోవాలనుకోటం లేదండి!!!
రాజనీతిలో దాగిన అవినీతి , ప్రజా సేవలో దాగిన దగా మారితే , ప్రజల సొమ్ము ప్రజలకు అందితేనే మార్పు .
తొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిజిలేబీ గారికీ , శర్మగారికీ , లాస్యగారికీ , నీహారిక గారికీ ,అజ్ఞాతగారికీ - సుజన సృజన వీక్షకులకందరికీ , యావన్మంది బ్లాగరులకూ 2016 పొడవునా సుఖ శాంతులు కలగాలనీ , ఆయురారోగ్యాది ఐశ్వర్యాలు సిధ్ధించాలనీ మనసారా కాంక్షిస్తూ , సుజన సృజన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది .
తొలగించండిగతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
రిప్లయితొలగించండిమయ్యె గాని , సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె అన్నింట మాన్యత గద !
"మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !"
నిజమే , మానవత్వమొక్కటి నిలబడితే - అన్ని సంస్కారాలూ సిధ్దించినట్లే . దరిమిలా , మంచి సమాజం ఏర్పడుతుంది . ధన్యవాదాలు .
తొలగించండిvery good poems sir
రిప్లయితొలగించండిధన్యవాదాలు .
తొలగించండి