చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి
ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్
నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు .
అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే , మామ్
దట్స్ గుడ్
****************
హలో బావ గారూ , ఏవిటో
ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ
లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ,
నువ్వటోయ్ , అదేవిటోనోయ్
మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి
చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ
భోషాణంతో నేను పడ్లేను, ఒక
ఊరోపరి కానీ , హస్తోపరి
కానీ కొని తగలడరా అంటే వింటాడా ,
మా శివుడు ? నిన్నకు
నిన్న _ తెలుగేలా
ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ
వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం
తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు
పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ
తగలడు .
****************
హలో వదినా , ఈవినింగ్
సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం
ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్
కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే
ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్ ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా
నేరేట్ చెయ్యీ .
****************
భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు
పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల
వాడుకుందాం .
ఓరుగంటినీ , ఒంటమిట్టనూ
ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన
వాడుకలోకితీసుక రాగలిగేరా ?
రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్
నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల
వాడుకోవడం మన భాషకూ , మనకూ
ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే
కృతకమై , వికృతభాష
తయారౌతుంది .
అట్లనే వినియోగంలో ఉన్న
తెలుగు పదాలకు బదులు ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
నా తెలుగు జాతికంతటికీ
మాతృభాషా శుభాభినందనలు .
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
రిప్లయితొలగించండితెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
- శ్రీకృష్ణదేవరాయలు
తెలుగుభాష మాధుర్యం ఉగ్గుపాలనుండి, ఉయ్యాలలోనుండి, అమ్మ లాలిపాటనుండి ఆస్వాదిస్తున్నను, కొందరికి ఈ మాతృభాష పట్ల ఎందుకింత ఉపేక్ష?
అయిన తెలుగుభాష తియ్యదనంను ఎంతో ఆపేక్షగా తెలియజెప్తున్న మీ కృషి అభినందనీయం మాస్టారుగారు.