8, మే 2026, శుక్రవారం

అందుకో ఆదుకో


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

మాయమ్మా మమ్మేలు పోలేరు తల్లీ

--------------------------------------------


అమ్మా ఓ యమ్మా మాయమ్మా మమ్మేలు తల్లీ

అద్భుతాలు సృష్టించే అమ్మా  మా పోలేరమ్మా

అందుకో ఆదుకో అడు గడుగున లలితమ్మా


రత్న ఖచిత వేదికపై రమణీయ రంగముపై

ఇంద్రభవన మందిరమం దిందుశోభ నందితవై

కోటిసూర్య ప్రభల వెలుగు కళ్యాణీ పరమేశ్వరీ


అమ్మా ఓ యమ్మా మాయమ్మా మమ్మేలు తల్లీ

అద్భుతాలు సృష్టించే అమ్మా  మా పోలేరమ్మా

అందుకో ఆదుకో అడు గడుగున లలితమ్మా


ఖల జనముల పీచ మణచ కాళికవై కాపాలికవై

ఇల సుజనుల రక్షింపగ  ఈశ్వర హృదయేందిరవై

భువనావనపరంజ్యోతి దుర్గా శైలసుతా శ్రీలలితా 


అమ్మా ఓ యమ్మా మాయమ్మా మమ్మేలు తల్లీ

అద్భుతాలు సృష్టించే అమ్మా  మా పోలేరమ్మా

అందుకో ఆదుకో అడు గడుగున లలితమ్మా


పసుపూ కుంకుమ చందన పరిచర్చిత శ్రీవపుషా

సతత హరిత శుభ ప్రాంగణ సంపత్తరు  విభవా

ఆలయ గోపుర విలాస హాళుల ఆనంద నిలయ


అమ్మా ఓ యమ్మా మాయమ్మా మమ్మేలు తల్లీ

అద్భుతాలు సృష్టించే అమ్మా  మా పోలేరమ్మా

అందుకో ఆదుకో అడు గడుగున లలితమ్మా


7, మే 2026, గురువారం

తెలుగు భాష


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు               
 
ముగ్థ మోహన రూపు
మురిపాల తెలుగు లిపి
ముత్యాల సిరి పేర్చు
ముగ్గులను తలపించు     

తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు        
 
మురళీ రవం లాంటి
మోహన గానాలు పల్కు
 శబ్ద జాల మొలికించే
 సంగీతపు సరిగమ సిరి      

            
తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు      

దిగంతాల నజంతాల
పద సంపద పొదువు కొన్న
నుడి కారపు సొంపులు గల
మడి మాన్యపు టక్షరాల     

తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు      
 
తెలుగు తోట పూ మొక్కకు
సంస్కృత లత లంటు గట్టి
తెలుగు దనపు నీరు పెట్టి
తెలుగు పూలు పూయించిన     

తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు        
 
మాతృ భాష మమకారం
మంచి నీటి చెలిమ విథం
పర భాషల వ్యామోహం
ఎండ మావితో స్నేహ పథం     

తెలుగులో మాటాడు
తెలుగు లోనె మాటాడు
తెలుగు వాళ్ళందరితో
తెలుగు తెలిసిన వారందరితో
తెలుగు లోనె మాటాడు      


5, మే 2026, మంగళవారం

మనదేశం మనగీతం


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

మనదేశం – మనగీతం

-----------------------------

మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం           


జన గణ మన పాడుదాం   జనయిత్రిని పొగుడుదాం

వందే మాతర మందాం    వందనా లర్పిద్దాం        


         మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం   


మహనీయుల జీవితాల   కథలు చదువుదాం

మనసంతా దేశ భక్తి    మకరందం నింపుదాం        


         మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం   


పౌరసత్వ బాధ్యతలను   పక్కాగా పాటిద్దాం

గత కాలం కన్న  మించు   ఘనత  నిలుపుదాం     


మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం   


మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం   

 

అన్న దమ్ములకు మల్లే   హుందాగా జీవిద్దాం

ప్రపంచాన భరత జాతి   ప్రతిష్ఠ పెంచుదాం                     


మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం

అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం   


ఆమె పేరు భరత మాత


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

ఆమె పేరు భరతమాత

ఆమే నా జనయిత్రి

అద్భుత భారత ధరిత్రి


ఆమె ఘనత హిమవన్నగ

ఉత్తుంగ గిరీశ శృంగ

ఆమె కీర్తి నిర్జర ఝరి

ధవళ ఫేన దీప్తికి సరి


ఆమె పేరు భరతమాత

ఆమే నా జనయిత్రి

అద్భుత భారత ధరిత్రి


ఆమె వాక్కు వేదోపనిష

దద్భుత సాహిత్య నికష

ఆమె యునికి ఉదధి త్రయ

సంవలయిత రత్న గర్భ


ఆమె పేరు భరతమాత

ఆమే నా జనయిత్రి

అద్భుత భారత ధరిత్రి


భరతావని జనియించిన

ప్రతి పౌరుని తనువంతా

ఆమె తలపు అణు వణువున

ఆనందపు పులకింత


ఆమె పేరు భరతమాత

ఆమే నా జనయిత్రి

అద్భుత భారత ధరిత్రి


4, మే 2026, సోమవారం

నీవు లేని చోటు .....


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

నీవు లేనీ చోటు  నింగిలో నేలలో

పరికింప లేదురా  ప్రభు సాయి నాధా     

ఇలలోన కలలోన  నెలవు నెలవులలోన

పలుకులో పాటలో  పరమాత్మవూ నీవె


పుడమిపై మొలకెత్తి  పొలుపుగా వికసించు

రంగు రంగుల పూల రంగులోనూ నీవె

పిందెలై కాయలై   ప్రియమార పండిన

మధుర ఫలముల లోని మధువులూ నీవె


నీవు లేనీ చోటు  నింగిలో నేలలో

పరికింప లేదురా  ప్రభు సాయి నాధా     

ఇలలోన కలలోన  నెలవు నెలవులలోన

పలుకులో పాటలో పరమాత్మవూ నీవె


జల జలా ప్రవహించు జలరాశియూ నీవె

తళ తళా మెరయు  గిరి శిఖరమూ నీవె

వెలుగులు విరజిమ్ము  విశ్వాంతరాళాన

వెలుగువై నీవుండ  వెరపేమిరా మాకు


నీవు లేనీ చోటు  నింగిలో నేలలో

పరికింప లేదురా  ప్రభు సాయి నాధా     

ఇలలోన కలలోన  నెలవు నెలవులలోన

పలుకులో పాటలో  పరమాత్మవూ నీవె


దారి నీవేయని దరిజేరినామురా

దారి జూపించి మా  దిక్కుగా నిలుమురా

వేవేల సంస్తుతుల  వినుతించి పొగిడేము

పరవశంబున కొల్చి  పాటలను పాడేము


నీవు లేనీ చోటు నింగిలో నేలలో

పరికింప లేదురా  ప్రభు సాయి నాధా     

ఇలలోన కలలోన  నెలవు నెలవులలోన

పలుకులో పాటలో పరమాత్మవూ నీవె


ఏ యుగమున గాని


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల

వెంకయ్య స్వామి

----------------------

ఏ యుగమున గాని  ఇంత స్వచ్చతముని

విని యెరుగము తండ్రీ  వెంకయ్య స్వామీ


వశ్యవాక్కు లనుచు   వచియింతురే గాని

నిన్ను గన్నంతనే   నిజమనుచు తెలిసెను


ఏ యుగమున గాని   ఇంత స్వచ్చతముని

విని యెరుగము తండ్రీ   వెంకయ్య స్వామీ


పసుల మనుషుల రోగ   బాధలను తప్పింప

నిన్నంపె పరమాత్మ    నీల మోహన రూప


ఏ యుగమున గాని   ఇంత స్వచ్చతముని

విని యెరుగము తండ్రీ   వెంకయ్య స్వామీ


జలయఙ్ఞములు జేసి   జనములకు మాతండ్రీ

వ్రేలిముద్రలను వేసి   విల్లు వ్రాస్తివి స్వామీ


ఏ యుగమున గాని   ఇంత స్వచ్చతముని

విని యెరుగము తండ్రీ    వెంకయ్య స్వామీ


గొలగమూడి నివాస   గోవింద పరమాత్మ

ఆది నారాయణ రూప   ఆదుకో వెంకయ్య


ఏ యుగమున గాని   ఇంత స్వచ్చతముని

విని యెరుగము తండ్రీ  వెంకయ్య స్వామీ


3, మే 2026, ఆదివారం

ప్రణుతింతు ప్రణుతింతు


 గీత రచయిత: వెంకట రాజారావు లక్కాకుల


ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా
------------------------------------------------------
విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

నిన్ను నమ్మిన వాళ్ళు నిజ జీవితాలలో
ఎదురైన కష్టాల నెదిరి గట్టెక్కుదురు   

విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

కల్మషము లేని నీ కరుణా కటాక్షాల
తడిసిన యెల్లరు తరియించ గలరు    

విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

చేతులు జోడించి నీ చెంత జేరిన వాళ్ళ
భద్రతల బాధ్యతలు భరియింతువీవు    

 విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

మది మందిరములలో నిను నిలిపి నిశ్చింత
నెమ్మది హాయిగా నిదుర వోదుమురా    

విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

కృష్ణరారా


 గీత రచయిత : వెంకటరాజారావు లక్కాకుల


కృష్ణ రారా చిన్నికృష్ణ రారా

--------------------------------

కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


స్వఛ్ఛమైన మనసులన్ని  పాల సమానం

పాలు చిలికి తీయు వెన్న   ప్రేమ సమానం

ప్రేమ వెన్న నైవేద్యం  ప్రియమని నమ్మితి కృష్ణా   


 కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


మమకారపు పిచ్చి ప్రేమ కుమ్మరించియశోదమ్మ 

తర తరాల తల్లి ప్రేమ  త్రచ్చి వెన్న తినిపించెను


కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను


కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు  

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి



కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


ఘనముగ యమునా వనమున    తినిపించిరి గోపాలురు  

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న

      

కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా


తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధుల

భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న         


 కృష్ణ రారా

చిన్ని కృష్ణ రారా

ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా

ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

దివ్య పురుషులు


 గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా

గొప్పదనమిది భరత ఖండమం దనాదిగా

 

అవ్యయుని రూపాన నారాథ్యులై వెల్గు

దివ్య పురుషులు లేని దిక్కొకటి గలదా 

తనర జన గణము నొక్క త్రాటిపై నడిపింప

తీరు తీరుల గలరు దివ్యప్రభావులు


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా

గొప్పదనమిది భరత ఖండమం దనాదిగా


యెల్లెడల మనుజుల వెన్నంటి కాపాడు ఆ

కరుణాంతరంగు నీశ్వరుని దర్శింప

దారి జూపించు మహితాత్ము లెందరో

పంతమేటికి ఈ భాగవతుల సేవలో 


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా

గొప్పదనమిది భరత ఖండమం దనాదిగా

 

అరుదైన పరమాత్మ సురుచిరమూర్తిని

అరసి కొలువందగును ఆరాధ్యులందున

ఇందిరారమణునీ హిమశైలజానాధునీ

ఇనకులేశునిగాని ఘనశ్యామునీగాని


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా

గొప్పదనమిది భరత ఖండమం దనాదిగా

 

తిరుమలేశునిగాని తిరు రామానుజులగాని

సరిలేని శుభనాము  శిరిడి సాయినిగాని

సద్గురుడు వెంకయ్య స్వామి వారల గాని

పరమాత్మ రూపాన పరిపరి దర్శించగా


తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా

గొప్పదనమిది భరత ఖండమం దనాదిగా