21, జూన్ 2020, ఆదివారం
నమో🙏సూర్యనారాయణా !
నమో🙏సూర్యనారాయణా !
.....................................
ఇనుడు చంద్రుండు పుడమి ఒకే వరుసకు
వచ్చిన ఖగోల అద్భుతం బదిగొ కనుడు ,
పుడమిపై సూర్యకిరణాలు పడు విధమ్ము
నడ్డుకొని యడ్డునిల్చు చంద్రగ్రహమ్ము .
ఇందువలన మరే మార్పు చెంద దవని ,
ఇది ఖగోళ సహజ చర్య , ఎవ్వియును న
నూహ్య కష్ట నష్టాలు వినూత్నములును
సంభవించ వాందోళన జనగ వలదు .
ఆరాశివారు చెడుదురు ,
ఈరాశులవారు లబ్ధి కెక్కుదు రనుచున్
నోరేసుక కార్తాంతికు
లూరక తెగవాగుచుందురు , వలదు వినగా .
సూర్యునికి గ్రహణ మేమిటి ?
ఆర్యా ! పరిపూర్ణ శక్తి కాద్యుండు , సదా
శౌర్యప్రతాప తాప సు
కార్యౌదార్యోజ్జ్వల ప్రకాశుడు మనకున్ .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అలా అంటే ఎలా మాస్టారూ? ఇటువంటి ప్రత్యేకదినాల మీద గంపెడాశ పెట్టుకుంటారు మన మీడియా వారు, పాపం. ఇవాళ ఉదయం నుండీ వీక్షకులనెంతగా అలరించారో కదా సూర్యగ్రహణం మీద కార్యక్రమాలు చేసుకుని. దుష్ప్రభావాలేమీ ఉండవు అని చెప్పి వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు జల్లితే ఎలా?
రిప్లయితొలగించండిసమాజంలో మూఢనమ్మకాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి ... ఆధునికత పెరగడం వల్ల మూఢత్వం తగ్గడం పోయి. ఇప్పుడు అవి వ్యాపారాలయిపోయాయి. ఆలోచనల పరంగా మనుష్యులను ఓ రెండు, మూడు వందల యేళ్ళు వెనక్కు తీసుకు వెడుతున్నాయి. దురదృష్టకరం.
పెద్దలు శ్రీనరసింహరావుగారికి నమస్సులు ,ధన్యవాదాలు . మీరన్నది అక్షరాలా నిజం . నా 'మనభాగ్యమెట్లున్నదో' అనేపోష్టు వీక్షించండి .
తొలగించండిఈ మూఢనమ్మక మనునది యొక చిత్రమైన పదము. ఒక విధముగ జూచినచో నది మూఢమైన నమ్మకము. మరియొక విధముగ జూడ నది మూఢుని యొక్క నమ్మకము. మూఢత భావించువాని యందున్నదా భావనీయమగు విషయము నందున్నదా యనునది ప్రశ్న. భారతీయ మగు జ్యోతిశ్శాస్త్రము వంక జూడకయే తత్సంబంధమగు సర్వవిషయముల యందును మూఢతను భావించు వాని యందే మూఢత హెచ్చు. అట్టి భావనలు చేయువారు వినిపించు వాదనలు విధులకు వినోదమును పామరులకు మిధ్యావివెకమును కలిగించును. వినోదము కొంత వరకు నిరపాయమే కాని మిధ్యావివేకము పతనహేతువు.
రిప్లయితొలగించండిజగతి నఙ్ఞాన తిమిరాన చావగొట్టి
రిప్లయితొలగించండికడుపు కక్కుర్తి దీర్చుకో గాసి వడుచు
ద్రోహమున బతుకీడ్చు బుధులు గనంగ
భరత భూమిని బుట్టిన పాపఫలము .
రిప్లయితొలగించండిఅదిగో మెరాపి పర్వత
మదిగో గ్రక్కెను పొగల నమావాస్యదిన
మ్ము! దినమణి దాగను గ్రహణ
పు దినమ్మున జ్యోస్యము సరి పోయె జిలేబీ!
కౌంటరు వేయవలెనెపుడు :)
జిలేబి
సరిసరి ! బాగుంది వరస ,
తొలగించండినిరతము రగిలే 'మెరాపి' నిందుకు కతమై
కరముదహరించ ' నదిగో !
నరయుము , చీకట్లు గమ్మె నమవస నిశిలో .
ఇంతకూ పైన విశ్వనాథ వారి శైలిలో వ్రాసిన వ్యాఖ్యలో శ్యామలరావు గారు మూఢనమ్మకాలను ఖండిస్తున్నటువంటి మా బోంట్లతో ఏకీభవిస్తున్నట్లా, విభేదిస్తున్నట్లా చెప్మా? 🤔
రిప్లయితొలగించండివారి వ్యాఖ్యయందు స్పష్టత గోచరించుచున్నది చూడుడు!
తొలగించండి”మూఢత భావించువాని యందున్నదా భావనీయమగు విషయము నందున్నదా యనునది ప్రశ్న"
జన అజ్ఞాన వేదిక లు అహేతు వాదులు చేసే పనికిమాలిన ప్రచారం వల్ల మన సంప్రదాయాలు ఆచారాలు విలువ మనమే గ్రహించడం లేదు.
రిప్లయితొలగించండిమన పూర్వీకులు ఏర్పరచిన సంప్రదాయాలు చాలావరకు మేలు చేసేవి. అవి మూఢ నమ్మకాలు కాదు. శ్యామలరావు sir వ్యాఖ్య లో ఎంతో సత్యం ఉంది.
అహేతువాదులు చేసే పనికిమాలిన ప్రచారాలు ఓ 3 చెప్పండి
తొలగించండిజ్యోతిష్యం సైన్సా లేక మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా? శ్యామలీయంగారు చెప్పాలి
తొలగించండిదయచేసి శ్యామలీయం బ్లాగులో నేటి టపాను చూడగలరు.
తొలగించండివారి వ్యాఖ్యయందు స్పష్టత గమనించ
రిప్లయితొలగించండిమూర్ఖులనుచు దోచె మొదట , పిదప
భావనీయమైన బహుమూర్ఖ జ్యోస్యమ్ము
మూర్ఖజనుల యంశముగ దెలిసెను .
చిరు గారు. మన పూర్వ కర్మలు అనుసరించి పొందవలసిన ఫలితాలను అనుభవించడానికి తగు విధంగా గ్రహాలు పనిచేస్తాయి. They are facilitators. తీవ్ర పాప కర్మలను తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే జీవులలో కొంత వివేకం కలిగి సద్భుద్ధితో సత్కర్మలు ఈ జన్మలో ఆచరిస్తే కొంత వరకు సంచిత కర్మల ప్రభావం తగ్గుతుంది. అలా మంచి మార్గం లో వెళ్లే వారికే జ్యోతిషం గ్రహబలం కలుగుతుంది.
రిప్లయితొలగించండినాకు జ్యోతిష్కము గురించి తెలియదు. అయితే అది అద్భుత శాస్త్రము అనే నమ్మకం ఉంది.
పునర్జన్మ, కర్మ సిద్ధాంతం మీద పూర్తి విశ్వాసం ఉంది.
ఇది అందరూ నమ్మాలని లేదు. అయితే మూఢ విశ్వాసం గా కొట్టి వేయడం సరికాదు. మన భారతీయ శాస్త్రాల విలువ తెలిసిన ఎంతోమంది విదేశీయులు David frawley, Maria worth, Francois Gautier .. వారి ఉపన్యాసాలు, వారి రచనలు చూడండి. భారత భూమి సనాతన ధర్మం ఔన్నత్యం తెలుస్తుంది.
మీకు నా ప్రశ్న అర్ధంకాలేదు. దానికితోడు సమాధానం దాటవేయుటలో శ్యామలీయంగారి చాతుర్యానికి మీరు పడిపొయ్యారనే తెలుస్తోంది. ఇప్పటికైనా నా ప్రశ్న అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి.. అర్ధం కాలేదా.. నా తదుపరి వ్యాఖ్యలో సవివరంగా చెబుతాను..
తొలగించండిhttps://youtu.be/XZsJhI55hNQ
తొలగించండిఇంత చదువు చదివి.. నీడని చూసి భయపడతారా?
ఈ పోష్ట్ లో నేనూ , పెద్దలు శ్రీనరసింహరావుగారూ
రిప్లయితొలగించండిచర్చించిన అంశం .....
సూర్యకిరణాలు కొంతసమయంపాటు భూమిని చేరకుండా చంద్రగోళం అడ్డు రావడం అనూహ్యమూ
కాదు , విపరిణామమూ కాదు . సదరు గోళాల
చలనం ఒకేవరసలో రావడం వల్ల అప్పుడప్పుడూ
జరిగేదే . దీని కారణంగా భూగోళానికి గానీ , భూమిపై
నివసించే చరాచర జీవరాసులకుగానీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని
ఉటంకించడం , ఈకారణంగా ఏవేవో జరిగిపోతాయని ఊహాజనితంగా చెప్పిన కార్తాంతిక
మూఢులను ఖండించడం .
ఇంతవరకే మేము చర్చించింది .
కానీ , మూఢత్వాన్ని మాకాపాదించి , శ్రీ శ్యామలరావుగారు మాది మిథ్యావివేక మనియూ ,
పతన హేతువనియూ నినదించినారు , నిందించినారు . ఇది వారికి సమంజసమేనా ?
తొలగించండిసమంజసమో అసమంజసమో గాని వారి ఏకాగ్రతను రామ పథమ్మునుంచి జోస్యము పై మళ్ళించిన క్రెడిట్టు మీకు దక్కును. ఇలా ఏకాగ్రత గ్రహణపు వేళలో చెడునని శాస్త్రము చెప్పును దానికి కారణ, కరణముల సన్నిధిలో జనులు పడిన. అలా వారు మీ పరిధిలో పడుటకు కారణ కరణ మయ్యిరి మీరందరు.
దీనినే యోగమాయ అందురు :)
జిలేబి
మిత్రులు రాజారావు గారు, కేవలమును జనాంతికముగ చెప్పిన మాటలే కాని మిమ్ములను కించపరచట యను నుద్దేశము నాకు సుతరామూ లేదని మనవి. పొట్టకూటి జోస్యుల కారణముగ జ్యోతిషము మిక్కిలిగ నభాసుపా లగుచున్నది. ఇది కారణముగ జ్యోతిషశాస్త్రమును మనలో నధికులము శ్రధ్ధగ పరిశీలించకయే అభిప్రాయాలను వ్యక్తీకరించుటయును వాదములు చేయుటయును జరుగుచున్నది. శాస్త్రములో చెప్పిన దానికన్న ప్రచారములో నున్న వనేకము లపరిగ్రాహ్యము లను ఖండించవలసినదే.
తొలగించండిమిత్రులు జిలేబి గారు, నా విషయమై యిట్లు బెంగ పడవలదు
రామపథము నుండి ప్రాణము మరలదు
నాల్క నుండి రామనామ మట్లు
అలజడులకు కొండ యటునిటు కదలునా
భయపడుటకు ప్రాతిపదిక లేదు
ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ యోగమాయకు మరో ఉదాహరణ అక్కడ కాదేదీ బ్లాగులో వినరా వారు చిక్కి మార్కులకు లోకువై పోయేరు :)
జిలేబి
అవునండి “జిలేబి” గారు, అజ్ఞాత ఛాలెంజ్ ను టేకప్ చెయ్యడం నా పొరపాటే. సినిమా మోజు.
తొలగించండిబే...ద్ద హీరోల అభిమానులకు ఇట్టివి సహజ లక్షణములు..
తొలగించండి