సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, జనవరి 2012, శనివారం

సమస్యాపూరణలు


గజ్జ లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే

ముజ్జగంబుల నేలు సాయికి మ్రొక్కి పాటలు పాడరే
పజ్జ చేరి మహాను భావుని పాదపూజలు సేయరే
గజ్జ లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే
సెజ్జ హారతు లియ్యరే యభి షేకముల్ పలు సేయరే

కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులున్

 రాకు మహేంద్ర జాలమిది రాచిలుకా! కవికోకిలల్ మహా
పోకిరులమ్మలేనివిధముల్ వచియింత్రు-వసంతమేడ? మీ
కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులున్
కేకలు వేయుటల్ వినవ? గింజలు లేక వనమ్ములెండగా

చెడుగుల తో దేశమెల్ల శ్రీకర మయ్యెన్

చెడుపై సమరమునకు దిగి
కడుకొని కవి శంఖమూది కవితల నల్లన్
కడు చైతన్యము నొందిన
చెడుగుల తో దేశమెల్ల శ్రీకర మయ్యెన్ 


మకర శేఖరుండు మమ్ము బ్రోచు

తనకు చిక్క కెవడు తప్పించు కోలేడు
కాల విధిని దాటు ఘనుడు లేడు
ఉత్తరాయణమున నుజ్జ్వలు డాదిత్య
మకర శేఖరుండు మమ్ము బ్రోచు  పాపులను బ్రోచులే భగవంతు డెపుడు

దారి తప్పిన బిడ్డలే తల్లి దండ్రి
మదిని మెదులుట జూడగా మనుజులందు
దారి తప్పిన వారిని దరికి జేర్చి
పాపులను బ్రోచులే భగవంతు డెపుడు  దారము రక్షింపుము సాధుతతి' నండ్రు బుధుల్
ఘోరము 'సాధువు'ల విథము
నేర ప్రపంచముల నేలు నేర్పరు లగుటన్
'
శ్రీరమణా! పృథ్వీ కే
దారము రక్షింపుము సాధుతతి' నండ్రు బుధుల్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి