సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మార్చి 2012, శనివారం

తెలుగు బ్లాగర్లకు .....పండుగ శుభాకాంక్షలు


రామ జన్మ వలన భూమి పావనమయ్యె

భరత భూమి చరిత ప్రణుతి కెక్కె

రామ నామ జప విరాజిత వివశయై

భరత ఖండమెల్ల పరవశించెపురుషు లందు పుణ్య పురుషుండు రాముడే

పరమ సాధ్వి సీత భార్య యన్న

తమ్ము డన్న ఘనుడు తా లక్ష్మణుడు కదా !

భాగ్య శాలి హనుమ బంటనంగరామ నామ మెచట రంజిల్లి మ్రోగునో

హనుమ యచట నిలిచి యాడు చుండు

హనుమ యుండు చోట నభయమ్ము కొండంత

పృథివి యచట కడు సుభిక్ష మగునురాజ్య పాలనమున ప్రజా రంజకుడయి

ప్రజల పాలించె శ్రీ రామ రాజ్య మనగ

పుడమి నూరూర గుడి గట్టి పూజ లంద

రాము డొక్కడు దప్ప ఏరాజు గలడు ?భారత జాతికి పండుగ

శ్రీరామ జయంతి నాడు , చెప్పెద మిగులన్

నోరార శుభాకాంక్షలు

కోరి తెలుగు బ్లాగరులకు కూరిమి తోడన్
5 వ్యాఖ్యలు:

 1. మీకు,మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలండీ..
  ఆలస్యంగా చెప్తున్నాను.. మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీకు,మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. జలతారు వెన్నెల , రాజి ,శివరంజని - గార్లకు ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు