సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

6, మార్చి 2014, గురువారం

ఘనత బొగడంగ .....శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ
ప్రభవించి నడిచిన భరత భూమి
వేదాది వాజ్ఞ్మయ విజ్ఞాన వీచికల్
పరిమళించిన పుణ్య భరత భూమి
బౌధ్ధాది మతముల వర బోధనామృత
ఫలములు మెక్కిన భరత భూమి
గాంధీ మహాత్ముని ఖడ్గమయి అహింస
దొరల చెండాడిన భరత భూమి

ఘనత బొగడంగ ఇప్పుడీ కన్నులెదుట
సాక్ష్యమై నిల్చె దోపిడీ స్వామ్య మగుచు
నీతి మాలిన నేతల చేతల చెడి
పరువు గోల్పోయె నేడు నా భరత భూమి   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి