సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, ఏప్రిల్ 2017, సోమవారం

మా కుల్లూరు -- 9

మా కుల్లూరు -- 9
----------------
 పేలి తిప్ప దిగువ వీరాంజ నేయులు
విగ్రహమ్ము బండ వెలసి యుండ
పరగ నాకు దెలిసి బహుకాల మందుండి
దేవళమ్ము వెలుగు దివ్య మగుచు .

నాదు చిన్న తనము నందొక యఙ్ఞమ్ము
జరిగె నిచట దైవ సన్నిధి కడ
మహిత హితము గలుగె మహనీయు లెందరో
వచ్చి వైభవమ్ము వచ్చె గుడికి .

కుల్లూరున్నత పాఠశాలకు తగన్ గూర్చంగ పూర్వోన్నతుల్
వెళ్లే వాడిని ఆంజనేయుడిని సేవించన్ పదోక్లాసు మా
పిల్లల్నెల్లర గొంచు పూజలకు పబ్లిక్ వ్రాయు మున్ముందు తా
నెల్లన్ జల్లగ జూచి పిల్లలను దీవించంగ నెంతేనియున్ .

2 కామెంట్‌లు:



  1. మా కుల్లూరని రావుగారు సుమముల్ మాకంద జేసెన్ గదా!
    యీ కూర్మిన్ గనుచున్ శుభాంగి మదియయ్యెన్గూడ సౌమ్యంబుగన్
    మీ కార్యంబుల మేల్మి పిల్లలకటన్ మించారు జేర్చెన్ సదా
    ఓ కారుణ్య గురో ! జిలేబి కొణిగెల్ ! ఓ కర్మవీరా ! నమో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు ,

      ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
      మిచ్చి గురు స్థాన మెక్క జేసె
      ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
      బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
      ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
      వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
      ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
      విద్యా ప్రదాతయై వినుతి కెక్కె

      నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
      గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
      పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
      తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె .

      తొలగించండి