సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మే 2017, బుధవారం

మా కుల్లూరు -- శాసనాధారాలు

మా కుల్లూరు - శాసనాధారాలు
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .

శాసనం
---------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి