సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

భారతావని చల్లగా బ్రతుకు గాత !

హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు

అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !

4 వ్యాఖ్యలు:

 1. కూటికోసం కోటి తిప్పలు గదండీ ?

  చేయి చాచి ముష్టి అడగనంతవరకూ,
  సూర్యుని చూచి దిక్కులు గుర్తుపట్టేంతవరకూ,
  సాహచర్య లెక్కలు తప్పనంతవరకూ,
  ఏ కులమున పుట్టినా మనుజుడెపుడూ
  భారతావని చల్లగా బ్రతుకుగాత !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిరక్షరాశ్యులు కృషిని నమ్ముకుని శ్రమైక జీవనం సాగిస్తుంటే ,
  పొట్టకూటికి పండితులు అనృతాలూ - అసంబధ్ధాలూ - మో
  సాలతో చదువును అపహాస్యం చేస్తారా ?
  నీహారిక గారూ , ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు

 3. దట్టించగ విన్నాణము
  చెట్టల కైపుల జులాయి చేవల గనుచున్ !
  పట్టిరి కలమ్ము పలుకుల
  కొట్టిరి గురులెల్లరను పకోడీల వలెన్!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గురువు లన్న నాకు గౌరవాతిశయము ,
   మరి పకోడి యన్న మహిత హితము
   పడదు నాకు తగని పండి తాహంకార
   మన్న విహిత ! వినుము ! మాన్యచరిత !

   తొలగించు