సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

పురుహూతికా దేవి దర్శన భాగ్యం లభించింది .

పిఠాపురం వెళ్ళేను ,
పురుహూతికా సతీదేవిని దర్శించుకున్నాను .
తన్మయత్వం చెందేను .
---------------------------

11 వ్యాఖ్యలు:

 1. పురుహూతికాదేవి దర్శనం చేసుకున్నట్టే అనిపించింది మాస్టారు🙏.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అమ్మను జూచినంత వినయమ్మున చేతులు మ్రోడ్చి నిల్చితిన్
   రమ్మని చేయి సాచి సుతులన్ కడు ప్రేముడి బిల్చులాగు ఆ
   యమ్మ మనోఙ్ఞమూర్తి పరమాద్భుతమై గనుపింప - కన్నులున్
   చెమ్మగిలెన్ , తనూ పరవశీకృతమై శిశుభాతి నేడ్చితిన్ .

   తొలగించు


 2. చూచితి మీదు నేత్రముల, చూసిన పీఠములన్నియున్ కవీ
  వేచెను మానవీయతను వేగిర వృద్ధిని గాంచ నోయనన్
  తోచిన రీతి చెప్పితిని, తోయజ మాలల రూప మై సుమా
  నోచిన నోము లన్నియును నోర్మిని పెంచ వలెన్జిలేబులై !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఓరుములు , మానవీయత లున్న వనఘ !
   క్రొత్తగా క్షేత్ర దర్శనాయత్త మగుచు
   వచ్చు పనియేమి గాని , మీ పద్యభావ
   మేమియో దెలియుట లేదు మిత్ర వర్య !

   తొలగించు
 3. మిత్రులు రాజారావు గారూ, ఔరా ఔరౌరా, జిలేబీ గిద్యాలకు భావం గురించి అడుతున్నారా! అశచర్యం ఆశచర్యం!

  అర్థ మనగ నేమి యర్థంబు పని యేమి
  కొన్ని తెలుగు మాట లున్న చాలు
  భావ మనగ నేమి భావ ముండగ నేల
  గిద్యమౌ జిలేబి గిలికి నంత

  అదంతే. విశృంఖలాయతే నమః అని అనటమే తప్ప ఏమీ చేయలేం!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బుధ్ధి విశేషముల్ గలుగు పోడుము లున్న మహానుభావురా
   లద్దిన పద్య మయ్యది , కళాత్మక భావుక దృష్టి యెద్దియో
   'మొద్దును నాదు కుంచమయ బుధ్ధికి దోచదు' - గాని , యుండియే
   పెద్దది యుండు నేమొ యని వేడితి దెల్పగ రైరి మిత్రమా !

   తొలగించు
  2. ఆశచర్య మేల నయ్య ! శ్యామలరాయ !
   నాడు మీరు 'శతక దామ' మొసగి
   ఆకసమ్ము కెత్తి 'అమ్మకు జైకొట్ట'
   అప్ప డేడ బోయె ? ననఘ !విబుధ !

   తొలగించు
  3. బాగుంది రాజారావు గారూ, జిలేబీగారి నాటిధోరణి హాస్యప్రవృత్తికి పరిమితమైనంత వరకూ మెప్పులో తప్పులేదనే మెచ్చినది. పెడదారిని పడినప్పుడు నిరసించటంలోనూ‌ తప్పులేదనే తప్పుబట్టేదీను. పోనివ్వండి, మీతో వాదించగల ప్రజ్ఞావంతుడను కాను. నాదృష్టిలో తప్పైనది మీదృష్టిలో ఒప్పుకాకూడని లేదు కదా. మీ అభిరుచిమీది. దానికేమి, ఇబ్బందిలేదు.

   తొలగించు
  4. చదివి సంతసమున చప్పట్లు గొట్టినా
   మెటుల మరతు మయ్య ! హితుడ ! నేడు
   అద్భుతమ్ము రచన , ఆ 'జిలేబి' శతక
   పద్య పద్య మందు బహు పసందు .

   తొలగించు