సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

6, నవంబర్ 2018, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు
ఇది దీపావళి , నూనె దీపములు వెల్గించండి , భూమాత ది
వ్య దిదృక్షా సమలంకృతా విభవముల్ వర్థిల్లు , వేవెల్గు లీ
ను , దిగంతాల మనోఙ్ఞతల్ పరచు , ఙ్ఞానాబ్జాలు దీపించు , సం
పద లక్ష్ముల్ మన గుమ్మముల్ నిలుచు , నీ పర్వంబు మోదంబగున్ .

ధరణి పొగచూరి దట్టమై మురికిబారి ,
జీవములు వోయి , విష పవనావశిష్ట
కారణమగు టపాసులు కాల్చవద్దు ,
కోరి చేజేతులా చావు కోరవద్దు .

ఆనంద తుందిలమ్మయి ,
మేనులు పులకింప , నుద్యమించి , కుటుంబా
లూనిక దీపాల నడుమ
పూని నిలిచి , వెలుగు సిరుల భోగింప నగున్ .

9 వ్యాఖ్యలు:

 1. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మాన్యులు లక్కాకులవారికి దీపావళి శుభాకాంక్షలు! మీ దీపావళి సందేశము చాలా బాగున్నదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పర్యావరణ హితములు
  పద్యదీప సహితములు
  మాస్టరుగారి సుభాషితములు
  దీపావళి శుభాకాంక్షలు మాస్టారూ 🙏

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భ్రాతృవిదియ పర్వదిన శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భోజనానికి అన్నను పిలిచినట్లే భావించమంటారా ?
   ఐతే , తగిన బహుమతి కూడా ఎంపిక చేసుకోండి ,
   ముందుగా మంగళాశీర్వచనాలు .

   తొలగించు
  2. భోజనం తర్వాతే బహుమతి, సమయం వచ్చినపుడు తప్పక రావాలి, ముందుగానే మాట ఇచ్చారు కాబట్టి (సూర్యవంశం)తప్పకూడదు మరి...మీ ఆశీర్వాదం ప్రస్తుతానికి చాలు ధన్యవాదాలు.

   తొలగించు