సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, డిసెంబర్ 2018, శుక్రవారం

ఈ నలుగురూ .....నిను గన్న నీ తల్లి  నిరత పూజిత యగు                    అమ్మయై తనరారి అమృత మొసగు
నీతోడ బుట్టి యనితర ప్రియ మొసగి
సోదరి మధు ఝరీ సుధలు గురియు
నీ కోసమే పుట్టి నీలోన సగమైన
మగువ నీ సర్వస్వ మై మెలగును
నీకు బుట్టిన నీదు రాకుమారియె నిన్ను
తరియింప జేయును మురియజేసి 
                           
తల్లియై , తోడబుట్టయి , తనర పెళ్ల
మై , మురియ కూతురై  నిన్ను మనిషిజేయ
నీ నలుగు రున్న నే గద ! నీ బతుకు వె
లుంగును మగాడ ! లేనిచో లోపమె గద !

2 వ్యాఖ్యలు: