సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, జనవరి 2019, మంగళవారం

ముదిమి పైకొన్న .....

అళి నీల శిర సార తళతళల్ ధవళమౌ
నుదుటిపై ముడతలు పొదువు కొనును
కనుచూపు తగ్గును కన్నెడ పైకొను
చెక్కుటద్దమ్ములు చెలువు దప్పు
కాళ్లును సేతులు కీళులు సడలును
నడుము డస్సి నాణ్యము నశించు
ఉదరమ్ము పదపడి యుబ్బి చరించును
తిన్న దరుగని జబ్బు తీవ్రమగును

తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
మనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము ,
ఏ వయస్సున ముచ్చటల్ ఆవయసువి ,
సర్దుకుని మనుటె ఘనము , శాంతి యుతము .

2 వ్యాఖ్యలు:

 1. తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
  మనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము
  తప్పదు తప్పదు! మార్పు తప్పదు.
  ఇదియే నిజమని తెలిసీ కాదనుకునియేము.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు


  1. కష్టే ఫలే వారిలో మార్పు నిజమైనట్టుంది :)

   ఈ మధ్య పద్య వ్యాఖ్యలతో కలక్కిఫైయింగ్ :)


   జిలేబి

   తొలగించు