సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామనవమి శుభాకాంక్షలు

శ్రీరామపత్ని జనకజ
గారాముల భూమిపుత్రి కమనీయ దయా
వారాశి సీత సతియై
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .

శ్రీరామబంటు అంజన
గారాముల కూర్మిసుతుడు కరుణాంబుధి శ్రీ
మారుతి భజియించి కొలువ
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .

రామ నామ స్మరణ రాజిల్లి రంజిల్లి
'భారతీ'య తత్త్వ ఫణతి విరిసె  ,
జనక రాజ తనయ ననిలాత్మజుల గూడి
రామనామ మెంతొ రమ్యమయ్యె .

శ్రీరాముడు మారాముడు
శ్రీరాముడు హనుమ హృదయ సీతా రాముం
డారాధ్యుడు పుడమి సుతకు
ఆరాధ్యుడు సకలజగతి కండయు నతడే .

2 వ్యాఖ్యలు: