సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, జూన్ 2019, శుక్రవారం

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము


పరగ విశ్వ మనంతము , భ్రమణ రూప

చలన చాలన సంవృత్త శక్తి మయము

అందుగల కోట్ల గ్రహ తారకాది చయము

కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు


                                                                           
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత

యైన బోధ పడుట లేదు , తాను శక్తి

మంతు డెట్లగు? విశ్వనియంత కన్న

నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడుభార్య బిడ్డలు తాను ‘ – ఈమాత్ర మైన

చిన్న సంసార బాధ్యతే చేత గాని

మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని

విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,

పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు

బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన

తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?
ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు

దాతనే మరచు కృతఘ్నతా విధాన

భావనలు గల్గు మానవా! పతన మవకు

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

4 వ్యాఖ్యలు: 1. కైమోడ్చి భక్తి, ప్రేమల
  నీ మది లో నింపి తండ్రి నీవే దిక్కం
  చూ మహితాత్ముని తోడుగ
  నీమము తప్పక బతుకును నీడ్వు జిలేబీ !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబి గారు, మీ పద్యం నాకర్థమైయింది. చాలా సూటిగా, చక్కగా కూడా ఉంది.

   తొలగించు
 2. నీవే దిక్కని నమ్మిన
  ఏ వొక్కరినీ విడడు మహేశ్వరుడు , సదా
  కావంబూనును , దేవుని
  సేవించుట మనుజ తతికి శ్రీకరము సదా .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మాస్టారు గారు, ఎవరిని ఆశ్రయిస్తే అన్ని భాగ్యాలు సమకూరుతాయి అన్నది చాలా చక్కగా, అర్థవంతంగా వ్రాసారు.

   తొలగించు