సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, జులై 2020, బుధవారం

అందరున్నత కులజులే .....


హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్పరొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు

అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత
ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు
వారి ఘనతకు శతకోటి ప్రణతు లిడుదు .

10 కామెంట్‌లు:



  1. నమ్ముటకదె సిద్ధముగ జనాళి గలదు
    దేశ మందు మాపుణ్యమదేను‌ రాజ
    వారి మూఢత్వమే పెట్టు బడి విధాత
    చెప్పి నట్టి విద్యయె కూడు చేర్చె మాకు !


    "రున్నతుల" తరపున వకాల్తా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు శ్రీ జిలేబీ సారుకు వందనములూ ,ధన్యవాదాలు,
      నిజమే . మంది నమ్మకమే జ్యోస్యుల వ్యాపార పెట్టుబడి .

      తొలగించండి
  2. రంగు రాళ్ళు కూడా.
    ఇటువంటివన్నింటినీ నమ్మేవారిలోనూ విద్యాధికులు ఎక్కువేనండి. నమ్మేవారున్నంత కాలం చెప్పేవారు చెబుతూనే ఉంటారు. అంతా వ్యాపారమయమై పోయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు శ్రీ నరసింహరావు గారికి ధన్యవాదాలు ,నమస్సులు . మీరన్నది నిత్యసత్యం . విద్యాధికులైనా , విద్యలేనివారైనా నమ్మడానికి కారణం 1.భయం 2.లోభం , ఈ రెండూ ఎంతటివాడినైనా లోబరచుకుని
      వివేకాన్ని కోలుపడేవరకు భ్రమలో పడవేస్తవి . విజయానికి
      పట్టుదల ,కృషి ముఖ్యం . కాలం(దైవం)అనుకూలించడం కూడా ముఖ్యమే .
      ఐతే , జీవిత గమనంలో భవిష్యత్తును ముందుగా తెలుసుకోవాలనుకోవడం దురాశ . భవిష్యత్తే ముందుగా
      తెలుసుకోగలిగితే , ఇక , మనిషికి కష్టాలూ , కడగండ్లూ ఉంటాయా ? ఇంతచిన్న లాజిక్కే లోపించిన
      జ్యోతిష్యం నమ్మడం , కార్తాంతికులు నమ్మబలకడం మోసం ,దగా .

      తొలగించండి
  3. ఈ రోజులలో ఉన్నత కులజులు అన్న పదం వాడడం సరి కాదేమో. గారడీ చేసి బురిడీ కొట్టించే వాల్లు అన్ని కులాలు మతాలలో ఉంటారు.

    మోసగించే వాల్లు, మోసగించ బడే వాళ్ళూ, తెలివితో జాగ్రత్త పడే వాల్లు మూడు రకాలు జనాలు ఉన్నారు .🐘🐇

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది సత్యం . అందరున్నత కులజులే — ఇక్కడ కులమంటే మోసగించే మేధావి వర్గం .సమాజంలో గతంలో మాకులాలే ఉన్నత కులాలు ,ఫలానా కులాలు
      నిమ్నకులాలు అనే భావనలుండేవి . ఇంకా కొందరు ఆఅపోహలో
      ఉండి వ్యాఖ్యలు చేస్తుండడం బాధాకరం . అగ్రకులాలు
      అధమకులాలూ ఇప్పుడు లేవు . ఎవరికులం వాళ్ళకు గొప్ప . ఇప్పుడెవడూ తనకులం (పూర్వంలోలాగా)తక్కువదని భావించడంలేదు . మాది అగ్రకులం (ఇప్పుడుకూడా)అనేభ్రమలో బతుకీడ్చేవాళ్ళంతా
      మూర్ఖులే .

      తొలగించండి
    2. ఉన్నత కులాలవారు అంటే కొన్ని కులాలు గుర్తొస్తాయి. నిమ్నకులాలవారు అంటే కొన్ని కులాలు గుర్తొస్తాయి. సమకాలీన సంభాషణల్లోగాని వార్తావ్యాసంగాలలోగాని ఆ పదాలను జనసామాన్యం ఇలానే అర్థం చేసుకుంటుంది. ఒకవేల జనసామాన్యానిది మూర్ఖత్వం అంటే నేనేమీ చేయలేను లెక్కల్లో స్తిత్యంతర ధర్మాన్ని గుర్తుతెచ్చుకోవడం తప్ప.

      ఏ కులమూ తక్కువది కాదు అన్ని కులాలూ ఒక్కటే అనే భావన నిజంగా మనసుల్లో ఉంటే ఎవరో "అచ్చబ్రాహ్మణ వంటలు" అని పోస్తు పెట్టగానే మనోభావాలు దెబ్బతిన్నట్లు ఎవరూ నటించేవారు కాదు!

      తొలగించండి
    3. జనసామాన్యం ఈ నడమంత్రపు భావననుండి ధైర్యంగా బయటపడింది . కానీ , తాము ఉన్నత కులజులమనే భ్రమలనుండి బయటపడటానికి ఇష్టపడనివారే ఈ వివాదాలకు కేంద్రబిందువులు . అంటే , వీళ్ళకు కులాలన్నింటికీ వాటివాటి ఉన్నతులు , గౌరవాలూ వాటి
      కుంటాయనే సత్యాన్ని గ్రహించే తెలివిడి కొరవడింది . ఈ
      చర్చలో అడుగడుగునా ఈ దందా కనబడుతూనే ఉంది .

      తొలగించండి
    4. జనసామాన్యంలో ఓ వందమందిని "ఉన్నత కులజులు" అనే పదానికి అర్థం అడిగి "మేధావి వర్గం" అని ఎంతమంది సమాధానం చెప్తారో చూస్తే అనుమానం తీరుతుంది.

      తొలగించండి
    5. మేధావివర్గం అంతా మేం ఉన్నతకులజులమనే ఢంకా భజాయిస్తారు . ఏం , వీళ్ళు జనసామాన్యంలో వాళ్ళు
      కారా ? జనబాహుళ్యంనుండి విడివడి ఉండాలనుకునే
      సూపర్ వర్గమా ? ఇక్కడే చిక్కంతా . మేం సామాన్య మానవాతీతుల మనుకునే వాళ్ళతో జనబాహుళ్యాని కక్కరలేదు . సామాన్యజనబాహుళ్యమే ఈ అక్కరలేని ,
      అక్కరకురాని అసంబధ్ధ , అబధ్ధ మేధావి వర్గాన్ని కూడా
      పోషిస్తోంది .

      తొలగించండి