దీపావళి శుభాకాంక్షలు
ఆరోగ్య దీపమ్ము హాయిగా వెలుగొంది
భువికి మహాభాగ్య మొలయు గాత !
ఐశ్వర్య సందీప్తు లంత కంతకు హెచ్చి
సిరులతో లోగిళ్ళు పొరలు గాత !
కోర్కెల దివ్వెలు క్రొత్త వెల్గులు దెచ్చి
జీవన సౌఖ్యాలు చెలగు గాత !
విజయాల దీపాల వెల్గు వెల్లువ వచ్చి
బ్రతుకులో బంగారు పండు గాత !
అన్నిటికి మించి బుథులలో నలరు ‘ జ్ఞాన
లక్ష్మి ‘ లోకైక దీపాంకుర మయి వెలిగి ,
భువిని చైతన్య పరచి యీ భువనములకు
‘ తెలుగు బ్లాగర్లు ’ దివ్వెలై వెలుగు గాత !
దీపావళి శుభాకాంక్షలు మాష్టారు.
రిప్లయితొలగించండిజలతారు వెన్నెల గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు ,దీపావళి శుభాకాంక్షలు .
సుభ గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .