మనదేశం – మనగీతం
మనదేశం మనగీతం మహనీయత చాటుదాం
అడుగడుగున జాతీయత అంతరాన నిలుపుదాం // మన //
జన గణ మన పాడుదాం జనయిత్రిని పొగుడుదాం
వందే మాతర మందాం వందనా
లర్పిద్దాం // మన //
మహనీయుల జీవితాల కథలు
చదువుదాం
మనసంతా దేశ భక్తి మకరందం నింపుదాం // మన //
పౌరసత్వ బాధ్యతలను పక్కాగా పాటిద్దాం
గత కాలం కన్న మించు ఘనత నిలుపుదాం // మన //
అన్న దమ్ములకు మల్లే హుందాగా జీవిద్దాం
ప్రపంచాన భరత జాతి ప్రతిష్ఠ పెంచుదాం // మన //
బాగుంది మాష్టారు. తప్పకుండా అలాగే నడుచుకుందాము.
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారూ ,
తొలగించండిధన్యవాదములు . జాతీయ భావనల వైపు ఉత్తేజిత మయ్యే రాతలు మన బ్లాగర్లనుండి ఇతోథికంగా రావాలి .
గీతం చాలా బాగుంది. మనసులో మకరందం నింపుకుని అలా నడిచేందుకు ప్రయత్నం చేద్దాం.
రిప్లయితొలగించండివనజ వనమాలి గారూ ,
తొలగించండిధన్యవాదములు . నేటి మన దేశంలో జాతీయ సమైక్యత , దేశ భక్తి అవసరాన్ని గుర్తించండి . ఆ మేరకు ఉత్తేజ పరిచే పోష్టులు ప్రచురించండి.
చాలా బాగుంది మాష్టారూ పాట .
రిప్లయితొలగించండిసుభ గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .
మీరు కమ్మని తెలుగులో పాటలు రాస్తున్నారు . శ్రావ్యంగా పాడు తున్నారు .
దేశీయ సంపదలు స్వార్థ పరుల చేతుల్లోకి వెళ్తున్న నేటి తరుణంలో దేశీయులలో దేశ భక్తి రగిలించే పాటలు రాయండి . బ్లాగర్లంతా మన వంతు కృషి చేద్దాం .