ఒకప్పుడు విద్యాభ్యసనానికి ప్రభుత్వ పాఠశాలలే శర ణ్యం . సామాజిక అంతరాల హెచ్చుతగ్గులకు అస్కారంలేని చదువులుండేవి .
ధనవంతుడికొడుకైనా పేదవాడికొడుకైనా ఒకేపాఠశాలలోచదివేవారు. దీనివల్ల అంతరాలలోకూడా సఖ్యత ఏర్పడి సామాజిక సమతుల్యతకు దోహదం కలిగేది .
ప్రస్తుతవిద్యలో ప్రైవేటు భాగస్వామ్యం విస్తరించిన దరిమలా ధన వంతులస్కూల్లూ, పేదలస్కూల్లూ(ప్రభుత్వపాఠశాలలు)ఏర్పడ్డాయి
.
ధనికుడు ధనాధికుడుగానూ , పేద నిరుపేదగానూ స్థిరం అయ్యేపరిస్థితులు ఏర్పడ్డాయి.
కేవలం పదిశాతం ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నాయి . మిగతా తొంభైశాతం విద్యావ్యాపారాలుచేస్తూ
అక్రమమార్గాలలో అవాంఛిత పోటీ సృస్టిస్తున్నాయి . ప్రభుత్వ పాఠశాలల ఎన్రోల్మెంటు
పడిపోయి , కొనసాగించాల్నా వద్దా అనేస్థితికి చేరుకొన్నాయి . దీనికికారణాలుగా 1 . ప్రభుత్వాల
నిర్లక్ష్యం 2.ఉపాధ్యాయుల
బాధ్యతారాహిత్యం 3.తల్లిదండ్రులనిరాసక్తత
, నిరక్షరాస్యత 4.విద్యార్థులను విద్యాసక్తులనుచేసే మెకానిజంలేకపోవడం మున్నగు వాటిని ప్రముఖంగా చెప్పుకో వచ్చు .
బాధ్యతవహించవలసినవారంతా నిర్లక్ష్యం వహిస్తున్నపాపానికి చిన్నారులు చదువుకు
స్వస్థిచెప్పి శిక్షననుభవిస్తున్నారు . వివిధతరగతుల స్థాయులలో ఇరవైశాతం కూడా ప్రమాణాలు
సాధించినవారులేరంటే మనపాఠశాలలస్థాయి ఏపాటిదో ఊహించవచ్చు .
ప్రతివారూ బాధ్యతల నుంచి తప్పించుకొని
పైపెచ్చు ప్రమాణాలగ్రాఫులు పెంచుకోవడానికి అక్రమమార్గాలను ప్రోత్సహించడం చూస్తుంటే
విద్యలొ విపరీతధోరణులు ఎంత దూరం వెళ్తాయో! !
ప్రభుత్వపాఠశాలలు నిర్వీర్యం కావడానికి
ఉపాధ్యాయులుకూడా కొంతవరకూ కారణమే
ప్రభుత్వపాఠశాలలు నిర్వీర్యం కావడానికి అందులో
పనిచేస్తున్న ఉపాధ్యాయులుకూడా కొంత కారణం అనక తప్పదు . నాటి
ఉపాధ్యాయునికి నేటి ఉపాధ్యాయునికి అనేక అంశాలలో తేడా ఉన్న మాట వాస్తవం
లక్ష్యశుధ్ధి లో గాని , విద్యాబోధనలోగాని , "రోల్ మోడల్"గా
మార్గదర్శకత్వంవహించడంలో గాని నేటితరం ఏ అంశంలోనూ పోల్చడానికి సాహచించ
లేము.
నాటి ఉపాధ్యాయునికి తన వృత్తిపరమైన ధ్యాస తప్ప
వేరే వ్యాపకాలు లేవు . కాబట్టి మార్గ దర్శకుడిగా సమాజంచేత పూజింప
బడినాడు.
అందుకే నాటి ఉపాధ్యాయుడు " గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో
మహేశ్వర: " .
నేటి ఉపాధ్యాయుడికి అంతటి ఓపికా లేదు. అంతటి
తీరికా లేదు . నిర్దేశిత టీచర్ ట్రయినింగులలో , పోటీ పరీక్షలలో
నెగ్గి
ఉద్యోగంలో ప్రవేసించడంతోనే తన శక్తి యుక్తులకు ఫుల్ స్టాప్
పెట్టేస్తున్నాడు .
ట్రైనింగులో తాను నేర్చుకొన్న బోధనా పధ్ధతులు,
కృత్యాలు అక్కడే వదిలేసి వస్తున్నాడు . తరగతి గది లోకి ప్రవేసించ
డానికి
ముందు సమగ్రమైన ప్రిపరేషన్ అవసరం . ఎన్నో సమ కూర్చు కోవాలి . అందుకు
ఎంతో
సమయం వెచ్చించాలి . తరగతి గది లో పాటించ వలసిన తీరు – తెన్నులు అనగా
ఆహార్యంలోగాని , మాట తీరులోగాని , మర్యాదలు పాటించడంలోగాని ఎంతో ఓపిక
అవసరం .
విద్యార్ధులు తమ ఉపాధ్యాయుణ్ణి రోల్ మోడల్ గా భావిస్తారు .
నేటిఉపాధ్యాయుడు ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు . ఫలితంగా
విద్యార్ధి
తప్పు దారిపడుతున్నాడు. అస్తవ్యస్త సమాజం దాపురిస్తూవుంది .
ఈకారణంగానే
ఉపాధ్యాయ వృత్తి గురుతర బాధ్యయతలతో నిండిన , సమాజానికి బాధ్యత వహించవలసిన
వృత్తి గా భావింప బడుతూ ఉంది .
ఉపాధ్యాయులలో వృత్తిపరమైన డెడికేషన్ లేకపోవడం,
విద్యావిధానంలో అకౌంటబిలిటీ లోపించడం , వృత్తి లో
కొలమానాలు
నిర్దేశించకపోవడం , శాఖాపరమైన తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహించ బడడం
,
ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇతర ఆదాయ వనరులను విరివిగా నిర్వహిస్తూ
ఈవృత్తిని ఉపవృత్తిగా భావించడం చూస్తూవుంటే నేటిప్రభుత్వ పాఠశాలల
నిర్వీర్యానికి ఉపాధ్యాయులు కూడా కొంత మేర కారణంగా భావించడంలో
తప్పులేదు.
ప్రభుత్వ ఉపాధ్యాయులలో ఏ ఒక్కరూ తమ బిడ్డలను
ప్రభుత్వ పాఠశాలలలో చదివించడానికిఇష్టపడడం లేదంటే ప్రభుత్వ పాఠశాలలు
అందిస్తున్న విద్య పై తమకు నమ్మకం లేనట్లే కదా !
అంటే
తమపై తమకు
నమ్మకంలేనట్లే కదా !! ప్రభుత్వ
పాఠశాలల నిర్వీర్యానికి
తల్లి దండ్రుల
నిరక్షరాశ్యత – నిరాసక్తత కూడా కారణమే
ఇన్నేండ్ల స్వతంత్ర భారతావని లో గ్రామీణ
ప్రాంతాలు
కనీసం నలభై
శాతం అక్షరాశ్యతకు కూడా నోచు కో లేదు . ప్రముఖకారణం పేదరికం.
నిరంతర జీవన
పోరాటం . రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి . తాగుడు
మొదలైన దురల వాట్లు . అపరి శుభ్ర పరిస్థితులు .
అనారోగ్యాలు .
ఈ దుర్భర పరిస్థితుల నుండి తమను
తాము ఉధ్ధరించు
కొంటే తప్ప –బయట
పడ లేని దుస్థితి .
అనాదిగా ఇటువంటి
దుస్థితి లోనేపడి , అలవాటుపడి , బయటపడడానికి
చేత కాని
అజ్ణానం లో పడి కొట్టు మిట్టాడు తున్న గ్రామీణ
భారతాన్ని చైతన్యం
చేయడానికి చదువొక్కటే
మార్గం .
నిద్ర
లేవంగానే పిల్లలకు
ఇంత కలో గంజో పోసి ,
కూలి నాలి కెల్లి , సాయంత్రానికి ఇల్లు చేరుకొనే గ్రామీణ నిరు పేదలకు తమ
పిల్లలు బడికెల్తున్నారో, బజారున పడుతున్నారో ,
చదువుతున్నారో , బలాదూర్
తిరుగు తున్నారో తెలుసుకొనే
తీరికెక్కడిది ? ఓపికెక్కడిది
?
అసలు వీళ్లకు
తమపిల్లల విద్యాబుద్దుల పట్ల
నిరాసక్తత సహజం గానే ఉంది . పిల్లలుకూడా దారి
తప్పి , వీళ్ల మాట సుతరామూ
వినక పోవడమూ అచట కనిపించే సహజ వాతా వరణం .
పాఠశాలలకు సక్రమంగా వెళ్లరు .
వెళ్లి నా చదువు పై గురి కుదరదు. ధ్యాస
అసలే ఉండదు . అక్కడ వీళ్లను
పట్టించు కొనే వాళ్లస లుండరు . ప్రైమరీ తోనో , ఆరేడు తరగతులతోనో
మానేస్తారు .
షరా మామూలే
. కాస్త వయస్సు రాగానే
పెద్దలలాగానే కూలి నాలి . మళ్లీ అదే బ్రదుకులు
– అవే పరిస్థితులు .
మరి వాళ్ల
తరపున – వాళ్ల పిల్లల తరపున వకాల్తా
పుచ్చుకొనే వాళ్లేరి
? తమను తాము ఉధ్ధరించుకో లేని వీళ్లను ఉధ్ధరించే
బాధ్యత తీసుకొనే దెవ్వరు ?
మరి , ఎనభై శాతం ఉన్న
గ్రామీణ భారతం ఉధ్ధరింప
బడని నాడు - అది
చేసాం ఇదిచేసాం – అని
కాగితాలపై ప్రగతి సూచికల
గణాంకాల నివేదికలు
ప్రకటించుకొనే ఈ ప్రభుత్వాలు ఈ నగ్న సత్యాలకు
జవాబు దారీ వహించ వలసిన అవసరం
లేదా ?
విద్యార్ధులను విద్యాసక్తులను
చేయడానికి తగిన మెకానిజం లేదు
ఉన్న వాళ్ల పిల్లల తల్లి దండ్రులు విద్యా వంతులు
కావడం వల్ల
సహజం గా వాళ్ల లో విద్యాసక్తత ఏర్పడి ఉంటుంది . ఆ కుటుంబాలలో
తదనుగుణమైన
పరిస్థితులూ ఆ వాతావరణమూ ఉంటుంది . వాళ్లు చది వే పాఠశాలలలోని
సహాధ్యాయులుకూడా విద్యాసక్తత గల కుటుంబాల నుండి వచ్చిన వారైనందువల్ల
వాళ్ల తో పోటీ పడే స్థాయి ఏర్పడి ఉంటుంది . డబ్బు ఖర్చు చేసి చదివించే
ధనవంతుల బిడ్డలవడంవల్ల వాళ్లు చదివే కార్పోరేట్ విద్యా
సంస్థలలో
విద్యాసక్తత పెంచే అనేక ఆధునిక వసతులుంటాయి .
వీటన్నిటి కంటే బాల్యంనుంచే తల్లి దండ్రులు
తమ పిల్లలకు ఉన్నతస్ఠితులు అందుకోవాలనే సంకల్పాలను గట్టిగా ఏర్పరచి
ఉంటారు . సదరు సంకల్పాలకు
అనుగుణంగా ఆయా ఊహలలో విద్యాసక్తతలు
ఏర్పరచుకొంటారు . ర్యాంకులు సాధించి తదనురూప ఉన్నతస్థితులు
అందుకొంటారు .
గ్రామీణ పేదల పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది .
తల్లి దండ్రులు నిరక్ష రాశ్యులు . తమ పిల్లల ఉన్నత స్థితుల పై కోరికలు
అంతర్లీనంగా ఉండవచ్చునేమోగాని ఆ స్థితి గతులు తమకు లేనే
లేవనే
నైరాశ్యం కోరికలకు అడ్డుకట్ట
వేస్తుంది . నిరక్షరాశ్యులు కావడం వల్ల
తమకే లేని విద్యాసక్తిని తమపిల్లల కేర్పరచ లేరు .
ఈ పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు
,
అందులోని అర గొర
వసతులు వీళ్ళలో విద్యాసక్తత ఏర్పరిచే స్థాయిలో
లేవని కరాఖండిగా చెప్పవచ్చు . ఇందుకు బాధ్యతవహించ డానికి సుతరామూ
ఇష్టపడని ప్రభుత్వాలకూ , అందులోపనిచేసే ఉపాధ్యాయ సత్తములకూ వీళ్లపట్ల
అంతగొప్ప అనురాగా
లుంటాయని అనుకోవడం అత్యాశే అవుతుంది .
కాబట్టి పేదల పిల్లలను పాఠశాలలో
చేర్పించ డానికి గాని , వారికి విద్యాసక్తులేర్పరచడానికిగానీ
, వారు
పాఠశాలలలో కొనసాగడానికిగానీ , భవిష్యత్ లో వారికి ఉన్నత స్థితు
లేర్పడడానికి అవకాశా లేర్పరచడంలో గానీ తప్పని సరిగా తగిన మెకానిజం
ఉండి తీరాలి . అప్పుడే సమాజం లో బడుగుల ధనికుల మధ్య అంతరాలు
కాస్తైనా
తగ్గి శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది .
విద్యా
సదుపాయాల కల్పన లో ప్రభుత్వాల బాధ్యత
విద్యా సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత
గణనీయమైన ప్రాధాన్యత సంత రించు కొని ఉంది . జాతీయాదాయం లో అధిక శాతం
విద్యా సదుపాయాల
కోసం ఖర్చు చేసే ప్రభుత్వాలు విజ్ఞత గల ప్రభుత్వాలు .
విద్యా వనరులు ఎక్కువగా ఉన్న దేశాల లోని ప్రజలు ఎక్కువ శాతం
విద్యా వంతులౌ తారు . విద్యా వంతులున్న సమాజం లోని ప్రజలు తమ సమస్య
లకు
తామే చక్కని పరిష్కారాలు చూసుకో గల్గుతారు . అలాంటి దేశాలు అభి వృధ్ధి
పధంలో దూసుకు పోతాయి . ఆ దేశాల లోని ప్రభుత్వాలకు అవినీతి , ఆశ్రిత పక్ష
పాతం , లంచగొండితనాల మీద పోరాడ వలసిన అవసరం ఉండదు . అక్కడ ఉగ్రవాదం ,
వేర్పాటువాదం , హత్యలు , దోపిడీలు, అంటురోగాల వ్యాప్తి
– అనే
సమస్య
లుండవు . ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి . వ్యవసాయ , పారిశ్రామిక
ఉత్పత్తులు పెరుగు తాయి. జాతీయాదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తుంది .
ఇదంతా విద్యవల్ల ఏర్పడే బహుళ ప్రయోజనం .
మరి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తిస్తున్నాయి ?
. " విద్యాశాఖ పద్దు క్రింద ఇన్ని కోట్లు ఖర్చు
చేస్తున్నాం . ఖర్చు తప్ప
ఈశాఖ లో ఆదాయం కంపించడం లేదు " – అని గతంలో ఒక
మంత్రి మహోదయులు
సెలవిచ్చారంటే మన ప్రభుత్వాలను నడిపే ప్రబుధ్ధులు ఎంతటి విద్యాసక్తి
గలవారో , వారిలోగల ప్రజాసేవా భావం ఏపాటిదో ,
ఎంత
తల్లకిందులుగా
కార్యమగ్నమై ఉందో కీర్తించ వలసిందే .
దేశ ప్రజలంతా విద్యా వంతులైతే డబ్బు తీసుకొని ఓటెయ్యరు
కదా ! సారా పొట్లాలనూ , బిర్యానీ పొట్లాలనూ దరి దాపుల్లోకి రానియ్యరు కదా
!
విద్యా వంతు లైన
ప్రజల పై ప్రలోభాలు పనిచెయ్యవు . వారికేమి కావాలో చేయ
గల్గిన ప్రభుత్వాలనే నిక్కచ్చిగా ఎన్నుకొంటారు .
రౌడీ రాజ కీయాలకూ , గూండా
ప్రభుత్వాలకూ చెల్లు చీటీ పడుతుంది మరి !
నూటికినూరుశాతం విద్యా వంత మైన సమాజం
ఏర్పడడానికి ప్రభుత్వ పరంగా
ఏమేమి చేయాలి ?
కనీసం ఇంటర్ మీడియట్ స్థాయి వరకు ఒకే ఒక ప్రభుత్వ సెక్టార్ లోనే
విద్యాలయాలు నిర్వహింప బడాలి . విద్యాలయాలు రెసిడెన్షియల్ విధానంలో
సకల
సదుపాయాలు కల్గిన " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులు " గా తీర్చి
దిద్ద బడాలి .
అంటే పిల్లవాడు నర్సరీ లో " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సు” లో
అడుగుపెడితే ఇక ఇంటితో , తల్లి దండ్రు ల తో సంబంధం లేకుండా –
అక్కడే
పెరిగి పెద్దవాడై విద్యాబుధ్ధులతో ఇంటర్ పూర్తిచేసుకొని , మంచి మూర్తిమత్వం
రూపు దిద్దుకొని , ప్రయోజకుడై బయటి
ప్రపంచములోకి రావాలి. దీని కోసం
తల్లిదండ్రులనుండి ఒక్కరూపాయి కూడా వసూలుచేయరాదు , పేద , ధనిక తేడా లుండ రాదు.
పెద్ద పంచాయితీ
లైతే ఒకటి , చిన్న పంచాయితీలు రెండు మూడింటికి కలిపి
ఒకటి చొప్పున – జనాభా ప్రాతి పదికన కాంప్లెక్సులు ఏర్పాటుచేయ వచ్చు . ఖర్చు
విషయానికి వస్తే విద్యా శాఖలో ఒక్కో ఊళ్లో – మెయిన్ స్కూలు ,
హెచ్
సి , జి
సి , నాన్ ఫార్మల్ , హైస్కూలు , ఆర్ బీ సీ ,
ఎయిడెడ్
, ఇంకా
ఇంకా అనేకానేక
దండుగ మారి దుకాణాలన్నీమూసేసి ఆ నిధులను విని యోగించ వచ్చు .
అదేవిధంగా
సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ మొదలైన అవినీతిమయ హాస్టల్ల అవసరం
ఉండదు .
ఇప్పుడు
నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాలయాల అవసరంలేదు . ఇలా
విద్యా శాఖ నంతా ఒక కొలిక్కితెచ్చి ప్రభుత్వాలు పిల్లల నందర్నీ దత్తత
తీసుకొని ఇంటర్ వరకూ చదివించే బాధ్యత
తీసుకొంటే – అటు తర్వాత ఏర్పడ బోయే
సమాజాన్ని ఊహించుకొంటే ఎంత ఆనందం కల్గుతుందో గదా !
మీ ఆవేదన ఇందులో కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అలాగే మన విద్యా వ్యవస్థ దురవస్థ కూడా. వోట్లు, నోట్లూ తప్ప మరేమీ పట్టని నేతలు, తమ స్థితి గతులు తమకే పట్టని ప్రజలు మారనంతకాలం ఒక్క విద్యా రంగమే కాదు, అన్ని రంగాలూ ఇలాగే తగలడుతాయి.
రిప్లయితొలగించండికృష్ణ గారూ ,
రిప్లయితొలగించండిమీరన్నది అక్షరాలా నిజం . మార్పు కోసం మన వంతు కృషి చేద్దాం .
ధన్యవాదములండీ .
సర్, మీ అక్షర ఆవేదనా, నిష్పక్షపాత వివరణా ఎంతో బాగుంది.
రిప్లయితొలగించండిసర్కారీబడులు సరిగా లేవు ప్రయివేటు వాళ్ళు డబ్బు గుంజుతున్నారు.
వెరసి బీద విద్యార్దులు బాల కార్మికులో, బాల నేరస్తులో అవుతున్నారు.
మీ రచనలు ఇనత స్పూర్తిదాయకం కదా ఎందుకు రాయరు
ఏమాత్రం సమాజానికి పనికిరాని రచనలు మీ స్పందనకు నోచుకుంటున్నాయి.
మీ కామెంట్ ఉండాలంటే మా కవితలకు ఆ అర్హత ఉండాలి.
ఇకనుండి మీరు వారానికి ఒక పోస్ట్ రాస్తున్నారు అంతే .
సమస్సులు ..మెరాజ్
ఫాతిమా గారూ ,
రిప్లయితొలగించండిగ్రామీణ విద్యపై మీకు చక్కని అవగాహన ఉండడం మూలాన వాస్తవాన్ని వ్యాఖ్యానించారు . ఇక రచనల విషయంలో సామాజిక , హృదయోల్లాసాలు రెండూ ఆసించ దగ్గ ప్రయోజనాలే ! ధన్యవాదాలు .