సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, మార్చి 2012, గురువారం

తెలుగుబ్లాగుల తోటలో.....బ్లాగరు పూమొల్క లార !


పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన

రచయితలు క్రొత్తవారు   తారస పడంగ

జూచితిమి గాని నేడహో !   చూడచక్క

నైన   రచయిత లెందరో గాన నయ్యెతెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి

వ్రాయు  బ్లాగరు పూమొల్క లార !  మీ ర

చనల సౌగంధి కాలతో తెనుగు దోట

నేడదిగొ !  గుభాళించి పన్నీరు చిలికె ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,

కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి

వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,

బ్లాగు భారతి తెలుగున పరవశించెప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు

తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి

యొకట స్పందించు భావుకత గలదు

రచయితల కుండ దగ్గ వీ లక్షణములెఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి

కోరి గొంతెత్తి పాడు చున్నారు ,  చేరి

అందరికి శుభాకాంక్ష లంద జేతు

నందనోగాది   కానంద మంద గోరి  


18, మార్చి 2012, ఆదివారం

దిన దినాభి వృధ్ధి గను .....


తల్లి దండ్రి మనోల్లాస తన్మయత్వ

తాత్వికత నుండి జన్మించి ధరణి బడిన

మనిషి   తన ప్రమేయమె లేక , జనన మాది

తెచ్చుకొన్న లక్షణముల  దిరుగు చుండుతర తరాల నాటివి , తల్లి-దండ్రి ద్వార

రూపు , లలవాట్లు , బుధ్ధులు , రోగములును

సర్వము క్రమాను గతముగా సంక్రమించి

మనుట విధిరాత , ప్రారబ్ధ మనిరి , యైన -పెండ్లియై నీవు నీభార్య ప్రేమ మీర

బిడ్డలను గని  ఇవి   సంక్రమింప జేయ

న్యాయమా ?  సర్వ శుభ లక్షణాన్వితులుగ

పుట్టి జీవింప జేయగా బోలు గాని  తర తరాల నుండి తరలి , దరికి జేరి

మిమ్ము బాధించు అట్టి దైన్యమ్ము మార్చి ,

మిమ్ములను మీరు తీర్చి , మీ బిడ్డ బ్రతుకు

దిద్దుకొనుట మీ చేతిలోదే , తలంపమంచి యలవాట్లు , దైహిక – మానసికపు

సంతసము గూర్చు నారోగ్య సత్యములను ,

కోరికల మీద సంతృప్తి కూడి ,  కనిన

సంతు , శుభ లక్షణోపేత జనిత మగును  రూపు , లలవాట్లు , బుధ్దులు , రోగములును

సర్వమును సంతతిని కూడి సంక్రమించు

ననెడు సత్యాన్ని మరువని జనుల జాతి

దిన దినాభివృధ్ధి గను ,  సందియము లేదు