సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, జనవరి 2013, బుధవారం

వచ్చె నవ వత్సరమ్ము .....


 
 
 
 
వచ్చె నవ వత్సరమ్ము , కావచ్చు నిజము

కాల గణనమ్ము దీనిలో ఘనత యేమి ?

పేద శ్రీమంతు డగున ? దీపించి యెగసి

బడుగు బతుకుల వెన్నెలల్ పరుగులిడున ?మనిషి స్వార్ధాన్ని కొంతైన మాను కొనున ?

మనిషి మనిషిని దోచుట మాను కొనున ?

మనిషి దుర్మార్గ వర్తన మాను కొనున ?

మనిషి మనిషిని చంపుట మాను కొనున ?నేతలు వినీతులై తలరాత మారి

దేశ ప్రజలకు శాంతి సందేశ మిడున ?

చదువు పూర్తయి యుద్యోగ విధులు లేని

వారి బతుకులు కొలువుల చేరు వగున ?కోత లేని పవరు సమ కూరునా ?

లమ్ము పారి రైతన్న పొలాలు పండి

భారతావని కాకలి తీరునా ? ప్ర

భుత్వ పథకాల తీరు ప్రమోద మిడున ?అగును కారణ మవినీతి యన్నిటికిని

ఓటరులు నీతి మంతులై ఓటు వేసి

నీతి మంతుల నేతల నెన్ను కొనిన

నాటి నవ వత్సరమ్ములు వేడు కగును

1, జనవరి 2013, మంగళవారం

బ్లాగరులకు -2013- క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు


             హిత సమాజ నిర్మాణ బాథ్యత వహించి

                జనుల చైతన్య పరచు - విజ్ఞాన దాయ

                పోస్టులను వ్రాయు 'బ్లాగర్లు' మోదమంద

                నవ వసంత శుభాకాంక్ష లంద జేతు .

 

                                                                      ----- సుజన-సృజన