29, ఆగస్టు 2014, శుక్రవారం
26, ఆగస్టు 2014, మంగళవారం
తిక్క తలకెక్కింది
“శిరిడి సాయి బాబా దేవుడు కాదు “ -  ధర్మ సంసద్ తీర్మానం . 
    --
ఇదీ ఈరోజు వార్త . 
శిరిడి సాయి బాబా దేవుడు కాదనీ , గురువూ కాదనీ ,
అసలు 
సన్యాసీ కాదనీ , ఆయన్ని దేవుడుగా ఆరాధించ వద్దనీ  హిందువులకు
సదరు తీర్మానం ఆదేశిస్తూ ఉంది . 
బాబా దేవుడా , కాదా , అనే విషయం బాబా భక్తులు
చూచు కుంటారు .
ఈ దేశంలో ఇంకేమీ సమస్యలు లేవా , సదరు సంసద్ లు
తీర్మానాలు
చేసి పరిష్కరించడానికి ? అని సామాన్యులు ఈ
నిర్వాకాలను                                           ఈసడించుకుంటున్నారు
. స్వామి వివేకానందుల వారిని ఆదర్శంగా
తీసుకుని ఉంటే , 
సామాన్య జనం మధ్యలో కెళ్ళి వాళ్ళ సమస్యలు 
పరిష్కరించడానికి పూనుకునే వారు , అంతే కాని ,
ఇలాంటి 
వివాదాలు సృష్టించి , సమాజంలో చిచ్చు పెట్టే వారు
కారు అని ఉక్రోషిస్తున్నారు . 
జనాభాలో అత్యధిక శాతం ఉన్న దళిత వర్గాలను , వీళ్ళ
అనుచిత 
ప్రవర్తనల వల్ల ఆర్ష ధర్మానికి దూరం చేసిన ఈ
మేధావులు , ఇప్పు
డింకో వివాదానికి తెర తీశారని తిట్టి
పోస్తున్నారు . 
                        -----
బాబా  జనం మధ్యలో బతికాడు . సామాన్యులతో సహజీవనం
చేశాడు . 
వాళ్ళ సమస్యలను తమ సమస్యలుగా భావించాడు .
భగవంతుణ్ణి 
వాళ్ళకు సన్నిహితం చేశాడు . ఎలా జీవించాలో
నేర్పించాడు . ఆయనలో 
దురహంకారం ఏకోశానా కన్పించదు . దేని పైనా
వ్యామోహాలు లేవు . 
భగవంతుని లోని ప్రేమ తత్వం మూర్తీభ వించిన
మహానుభావుడు . 
సామాన్యుల మధ్య సంచరిస్తూ , మార్గ దర్శనం చేసిన
సద్గురువు . 
కట్టు బట్టలలో గాని , కడుపు నింపుకోవడంలో గాని ,
నివాసం విషయం
లో గాని కఠినంగా నియమాన్ని పాటించిన సన్యాసి . 
                           -----
బాబాను నమ్మి కొలిచే వాళ్ళు ఈ దేశంలో లెక్కకు
మిక్కుటం . బాబా గుడి 
లేని పల్లె టూళ్ళు ఈ దేశంలో లేవంటే అతిశయోక్తి
కాదు . నేడు రాముడంటే 
సాయి రాముడే . కృష్ణుడంటే సాయి కృష్ణుడే . అను
నిత్యం బాబా ఆలయాలు 
భక్తులతో , హారతులతో , భజనలతో దేదీప్యమానంగా
వెలుగొందు చున్నవి . 
పుట్టిన ప్రతి బిడ్డకూ సాయి నామం  చేర్చకుండా నామ
కరణం చేయడం లేదు . 
ఒక వ్యాపార సంస్థ పెట్టినా . ఒక అపార్ట్ మెంటు
కట్టినా పెట్టేది సాయి పేరే . 
సర్వం సాయి మయం   గా  ఎట్ట యెదుట కళ్ళకు కనబడు
తున్నప్పుడు 
శిరిడి సాయి బాబా దేవుడు కాదని తీర్మానించడం
సర్వజనులనూ తిరస్క
రించడమే . జన బాహుళ్యంతో మమేక మైన సాయి నామాన్ని
ఆపాలనే విఫల 
ప్రయత్నం మద్యందిన మార్తాండునికి చేతు లడ్డు
పెట్టడమే . 
రాముణ్ణి
కొలిచినంత గొప్పగా సాయిరాముణ్ణీ , కృష్ణున్ని తలచినంత మిక్కుటముగా       
 సాయి
కృష్ణుణ్ణీ  నేడు కొలుస్తున్నారు ,
తలుస్తున్నారు .   
దైవాన్ని అనేక రూపాలలో దర్శించడం , పూజించడం హిందువులకున్న గొప్ప గుణం . 
  దీన్ని కాదని ,   పెద్దలు భక్తి విషయాన్ని 
వివాదం చేయడం మాని , జన సామాన్యానికి దగ్గరై  , వాళ్ళ దైనందిన సమస్యలలో 
పాలు పంచుకుని , పరిష్కారాలను అన్వేషిస్తారని
ఆశిద్దాం . 
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
 
