సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, ఫిబ్రవరి 2019, గురువారం

ఫొటో పద్యంపసుపంచు ముదు రాకుపచ్చ కోక , హరిద్ర
వర్ణంపు రైక  ఠేవలను జూచి
కడు మనోఙ్ఞపు తనూ ఘన విభవపు చిరు
చెమటల కమనీయ సిరులు జూచి
తలమీది మూటపై గల వామ హస్తంబు
కుడిచేత కొడవలి కులుకు జూచి
గనిమపై నలవోక గమకించు గరిత జూ
చి , ప్రకృతి పులకించి చెలువు మించె ,

చుట్టు పట్టుల పచ్చని శోభ లొసగు
చేలు తలలూచె , నందంపు జిలుగు జూచి
వందలాదిగ బ్లాగ్ కవి వరులు మురిసి
పద్యములు గట్టెదరొ యేమొ భావుకులయి .

48 వ్యాఖ్యలు: 1. ఓరయ్యో పెద రాజ! మోపు తలపై సోకుల్ వయారంపుతో
  జీరాడంగను వచ్చినా కవితకై చిత్రంబుగా నయ్యరో
  యేరాలమ్ముగ నన్ను చూడ తృటిలో యేటో పదాల్ వస్తయం
  టా రాయన్ సరి మూట కట్టుకునినేటాటా యనంటానులే !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఓలమ్మో ! విను ! రాణిపేట గవురమ్మో ! ఫోటొ నచ్చింద ! ఆ
  చేలో తీసిన ' బొమ్మ ' చూడ తమిళం సిన్మాకు ఫోజిచ్చిన
  ట్లేలో నాకనిపించె , అమ్మడు కడున్ లీలా విలాసంబుగా
  హేలా కేళి కలాప జాల కళలన్ హృద్యంబుగా దోచెడిన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కరక్ట్ మాస్టారూ. సినిమా షూటింగులో పోజు లాగానే అనిపించింది నాకున్నూ. సినిమాలలో హీరో గారు తలకు తువ్వాలు చుట్టుకుని, పొలంలో నిలబడి నాలుగు గడ్డిపరకలో వరికంకులో చేత్తో ఊపుతూ పాట పాడుతూ గడిపేస్తాడు చూశారూ, అలా ఉంది 🙂.

   తొలగించు
  2. ఆ మేకప్ చూడంగనే ఇట్టే తెలిసిపోతుంది వీయెన్నార్ సార్ ,
   ధన్యవాదాలు .

   తొలగించు
 3. ఇంత లావు జిలేబీని ఎవరు చూస్తారండీ ? సన్నగా పొడుగ్గా రకుల్ ప్రీత్ సింగ్ లాగా ఉండాలి. గుండమ్మత్త రోజులనుండి ఇంకా బయటికి రాలేదు మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఎందుకు చూడరండీ? దిట్టంగా కుదిమట్టంగా జమాజెట్టీలాగా ఉన్న వాళ్ళు కొంతమందికి నచ్చుతారు (నాకు కాదు లెండి) 🙂.

   తొలగించు
  2. సార్ , మనసులో దాచుకోకుండా బయటపెట్టేసేరు . అద్గదీ , అలాగుండాలి , మేమేం అనుకోములెండి . మన్నించండి .

   తొలగించు


  3. కుదిమట్టంబుగ జెట్టిమబ్బుగ మరే గుంజాయిషీ గుబ్బగా
   అదిరేచూపుల తీయగంటి సమ వయ్యారంబు! నిన్జూడగా
   మదిరెండాడక చెప్పి నారు వినవమ్మాపూవుబోడీ జిలే
   బి! దువాడించుచు విన్నకోటవరులే విప్పార్చు నేత్రమ్ములన్ :)


   జిలేబి

   తొలగించు

  4. అపార్థం, అపార్థం మాస్టారూ. ఇటువంటి వస్తాదులు నాకు నచ్చరని ముందే మనవి చేసుకున్నాగా (పైన బ్రాకెట్లో). భయం వేస్తుంది 😳.

   తొలగించు


  5. పైన బ్రా , కెట్లో భయమేస్తోంది :)

   మిమ్మల్ని చూసా అండీ రావ్ సాహెబ్ :)   తొలగించు
  6. 🦁,
   పదిసార్లు శ్రీమతే రామానుజాయ నమ : అనండి !

   తొలగించు

  7. సరేనండీ !

   అనేసా :(


   శ్రీమతే రామ ! "అనుజాయ" ! నమః :)


   జిలేబి

   తొలగించు
  8. # “జిలేబి” గారు
   అట్టె అట్టె అట్టె “జిలేబి” గారూ, అక్కడే ఆగండి. నీహారిక గారు తన వ్యాఖ్యను ... నా పట్ల వారికి గల అపారమైన అభిమానం మూలాన ... నన్నుద్దేశించి ఇచ్చిన సలహా. రాజసానికి చిహ్నమైన సింహం బొమ్మ కూడా పెట్టారు కదా. మీరెందుకు తొందరపడిపోతున్నారు?
   ———————————

   # నీహారిక గారు
   థాంక్స్. కానీ ఎందుకట? నేనేమీ ప్రతిమాటకూ బూతుబూతు అంటూ చెవులు మూసుకునే రకాన్ని కాదు. మరి దేని పరిహారార్థం మీరు సూచించిన మంత్రపారాయణ చెయ్యాలిట నేను? చెప్పండి చెప్పండి.

   తొలగించు


  9. కాయ్ రాజా కాయ్ ! సైడ్ లైన్ లో నిలబడి చీర్సంటా, నారదా అనీ అంటాను :) కా మంటలు రెండు వందలకు మినిమమ్ తక్కువ కాకూడదు ఆయ్ :) మొదలెట్టండి :)   జిలేబి

   తొలగించు
  10. 🦁 భార్యావిధేయుడైన రేలంగి గారు అనేమాటది...సినిమా గుర్తులేదు.

   తొలగించు
  11. # నీహారిక గారు
   నేను రెండూ కాదు. సినిమా పేరు (పాత) "వెలుగునీడలు" కానీ ఇక్కడ .. ఇచ్చోట .. ఆ సినిమా పాత్రకు నాకూ పోలికేమిటి, అహ ఏమిటట ? చెప్పాలి మీరు.

   శివగోవింద గోవింద (వెలుగునీడలు)

   తొలగించు
  12. వీయెన్నార్ సార్ ,
   శ్రీమతే రామానుజాయ నమః అంటే ఏమిటి ?

   తొలగించు
  13. # నీహారిక గారు
   హ్హ హ్హ, ఆ పదం రచయిత "కాదేదీ బ్లాగ్ కు అనర్థం" బ్లాగర్ పవనకుమారుడనుకుంటాను కదా 🙂.

   చివరకు తిన్నగా జవాబు చెప్పకుండా ఇలా నిలదీసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట? సరే అలాక్కానివ్వండి, ఇహ ఇక్కడితో ఈ చర్చ గతి .... పైన మీరే సూచించినట్లు .... "శ్రీమతేరామానుజాయన్నమః"✋.

   "జిలేబి" గారికి నిరుత్సాహమే, కానీ తప్పదు మరి 🙁.

   తొలగించు
  14. "కాదేదీ బ్లాగ్ కు అనర్థం" ?
   "కాదేదీ బ్లాగ్ కు అనర్హం " కాదా

   తొలగించు
  15. అయ్యయ్యో, అలా పడిందా? మీరే కరక్ట్ మాస్టారూ. "కాదేదీ బ్లాగ్ కు అనర్హం" అన్నదే సరైనది.
   సారీ, పవన కుమార్.

   తొలగించు
  16. # రాజారావు మాస్టారు
   // "శ్రీమతే రామానుజాయ నమః అంటే ఏమిటి ?" //
   ----------------
   సరిగా తెలియదు మాస్టారూ. రామానుజాచార్యుల వారికి అభివాదం అయ్యుండచ్చు. బహుశః వైష్ణవ సంప్రదాయం? శ్రీమద్ రామానుజ ఏమో?

   అయినా ఉభయభాషాప్రవీణులు మీరు, నాలాంటి పామరుడిని అడగడమేమిటి?

   తొలగించు

  17. శ్రీమతే రామానుజాయ నమః‌ అనగా

   జాయ అనగా భార్య
   అనుజాయ అనగా అనుసరించి‌‌పోయే భార్య
   సో
   నీ శ్రీమతియే రామ , అనుసరించు భార్య :) కాబట్టి ఆవిడకే‌ వంద నములు అని అర్థమన్న మాట


   ఇట్లు
   ఆనని‌ జాయ :)


   జిలేబి

   తొలగించు
  18. ఇది నమ్మబుల్ గా లేదు , ఇంటర్ప్రిటీషన్ లాగుంది .
   నీహారికగారేమైనా .....

   తొలగించు
  19. "జిలేబి" గారా, మజాకానా 😀? దేనికైనా భాష్యం చెప్పగల సమర్థులు వారు 🙏 🙂.

   తొలగించు
  20. దీనిని భాష్యం అనరు, వక్రభాష్యం అంటారు.

   తొలగించు
  21. ఇదే "శ్రీమతే రామానుజాయ నమః‌" అనే పదాన్ని ఒక క్యామెడీ సాంగులో కూడా ఇరికించారు."సంతానమే లేక దత్తు తీసుకుంటారు, సంతు కలిగిందంటేను చిన్ని పాపాయి గతి శ్రీమతే రామానుజాయ్ నమః " అని.కాబట్టి అది అంత సూటైన వాడకం కాదు.ఏదో మెలిక దాగుంది.అప్పటి కాలపు వాడుక తెల్సిన పెద్దలే విప్పాలి.

   తొలగించు
  22. ధన్యవాదములు .
   నేను విచారించగా ,
   శ్రీరామానుజులవారి స్తోత్రం చేసే సందర్భంలో వారి నామాలకు ముందు
   శ్రీమతే అని చేర్చి నామం చెప్పడం వైష్ణవ సంప్రదాయం అని తెలిసింది .
   శ్రీమతే అని చెప్పడం రామానుజులవారిని నారాయణ భగవానులుగా సంభావించడం అని ఏతదర్థం .
   ఇంకా విశేషార్థముంటే , మన్నించి , తెలుపగోరుతాను .

   తొలగించు
  23. చాలా బాగుంది. పండితులు మీరు చెప్పిన తరువాత తిరుగేముంది మాస్టారూ?

   తొలగించు
 4. సీను జూచి యాపె చిత్రంబు తనదని
  ట్రాన్సు లోకి వెళ్ళి టాట జెప్పె
  విస్తుపోయి మనము వివరించ బూనినా
  వినదు గాక తాను వినదు వినదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీదై గ్రాలు కవిత్వధోరణికి , గ్రామీణంపు నేపథ్యముల్ ,
  మోదశ్యామల వర్ణముల్ , ప్రకృతి సమ్మోహంపు క్షేత్రంబులున్ ,
  నాదబ్రహ్మము నేలు గాలులును, మీనాక్షుల్ ,శుభాకారముల్
  వేదంబై మది కింపు గూర్చుగద ! భావింపంగ పద్యాకృతిన్

  ప్రత్యుత్తరంతొలగించు


 6. అడ్డదిడ్డము గానుబోవుచు నాంధ్రదేశము చుట్టుచున్
  గడ్డికోసితి మోపుగట్టితి గట్టిగానటు చేలలో
  వడ్డనమ్ము‌ను చేయరండయ వాసిగానగ పద్యముల్
  తెడ్డువేసెడు వారలెవ్వరు తేటగీతిని తోడుగా :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @ జై

  జై జవాన్ జై కిసాన్ నినాదం గూడార్ధం ఏమిటంటే సైన్యం/CRPF జవాన్లలో సింహభాగం జవాన్లు అర్ధాకలితో అలమటించే సన్నకారు రైతు/భూమిహీన రైతు కూలీ నేపధ్యానికి చెందిన వారే.

  Who told you this ? Any evidence ?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Jai Jawan Jai Kisan was a slogan of the second Prime Minister of India Lal Bahadur Shastri in 1965 at a public gathering at Ramlila Maidan, Delhi.

  Soon after Shastri took over the prime ministership of India after Nehru's death, India was attacked by Pakistan. At the same time there was scarcity of food grains in the country. Shastri gave the slogan Jai Jawan Jai Kisan to enthuse the soldiers to defend India and simultaneously cheering farmers to do their best to increase the production of food grains to reduce dependence on import. It became a very popular slogan.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఒక ప్రహేళిక

  నక్షత్రము గల చిన్నది
  నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
  నక్షత్రమునకు రమ్మని
  నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. @నీహారిక:

   "Who told you this ? Any evidence ?"

   The source of this information is a military historian (this is a highly specialized subject) who studied Indian jawan socio-economic conditions starting from 1857 war of independence till date. I will check if the book is available online.

   తొలగించు
  2. ఉత్తర' ఒకచేతిలో కుంకుమ 'భరణి' నుంచుకొని ఇంకో 'హస్త'ము తో సైగచేసి సింధూరము దిద్దుటకు తాను నిలబడి యున్న 'మూల'కు
   రమ్మని యుధ్ధమునకు సిధ్ధపడుచున్న చంద్రవంశజుడైన తన నాధుని అభిమన్యుని పిలిచెను .

   తొలగించు
  3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  4. నక్షత్రము గల చిన్నది(ఉత్తర')
   నక్షత్రము చేతబట్టి(భరణి) నక్షత్రప్రభున్
   నక్షత్రమునకు('మూల') రమ్మని
   నక్షత్రము(హస్త) పైనవేసి నాథుని పిలిచెన్

   తొలగించు
 10. జవానులు వేరే పని చేయలేక సైన్యంలో చేరుతున్నారు అని గానీ రైతులు అర్ధాకలితో అలమటించి సైనికులుగా మారుతున్నారని గానీ చెప్పడం నాకు సమ్మతం కాదు. జై జవాన్ జై కిసాన్ స్లోగన్ అందుకు ఏర్పడలేదని నా భావన. వేరే ఏ పనీ లేకపోతే అడుక్కుని అయినా తింటారు కానీ సైన్యంలో ఎవరయినా చేరతారా ? సైన్యంలో చేరేది (ఎక్కువగా) బోర్డర్ లో ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ! మనకి లేదా దేశభక్తి అంటారేమో ...ఉంది అది ఎంతవరకూ అంటే స్వాతంత్ర్యదినోత్సవం నాడు శుభాకాంక్షలు పోస్టుల్లో పెట్టేంత మాత్రమే !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నీహారిక గారూ, సరిహద్దు ప్రాంత ప్రజలు ఎక్కువగా సైన్యంలో చేరుతారన్న మాట కూడా అపోహే (ఉ. యూపీ & బీహార్). ఈ విషయం గురించి కూడా కెప్టెన్ గారి పుస్తకంలో రాసారు. వెతికాను కానీ "నెట్టింట్లో" పుస్తకం దొరకలేదు.

   రైతులు అర్ధాకలితో సైన్యంలో చేరుతున్నారని నేను అనలేదు. జవాన్ల సహజ వృత్తి వ్యవసాయం కనుక పిన్న వయసులో రిటైర్ అవుతున్న వారికి భూములిచ్చి (మాగాణీ సుమండీ) వారికి బాసటగా ఉండాలన్నదే నా అభిప్రాయం. సెక్యూరిటీ గార్డు కొలువులతో వారి ప్రతిభ, క్రమశిక్షణ & టాలెంటుకు న్యాయం జరగడం లేదు.

   "మధ్యతరగతి దేశప్రేమ" గురించి మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను.

   తొలగించు


 11. భారతీయ మిలిటరీలో కొన్ని రాష్ట్రాల నిష్పత్తి

  దీంట్లో మొదటి సెక్షన్ చదవండి. ఆఫీసర్ల సమాచారం మాత్రమే అయితే రెండవ సెక్షన్ చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు