సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, మార్చి 2019, శుక్రవారం

మహిళా దిన శుభాకాంక్షలు .....


అత్తలు కోడళ్ళు ఆడబడుచులు పర
         స్పరము ‘ సహకరించి ‘ బ్రతుకు రోజు
ఇరుగింటి పొరుగింటి ఇల్లాళ్ళ కష్టాలు 
          ఇంతుల ‘ కానంద ‘ మిడని రోజు
పక్కింటి తగవులు పడతికి టిక్కెట్టు
          లేని ‘ వినోదమ్ము’ కాని రోజు
మనకెందు కంటూనె  మాట పొల్లులు వోక
           పలు ‘ ప్రచారాల ‘ పాల్పడని రోజు
చెలగి ‘ ఈర్ష్య లసూయలు  స్త్రీకి సహజ ‘
మని  జగమ్మున భావింప బడని రోజు
‘ స్త్రీకి స్త్రీ శత్రు ‘ వను పేరు చెఱగు రోజు
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

4 కామెంట్‌లు:

  1. సజీవంగా ఉండే భాషలకు మార్పు సహజం .
    మార్పు దిశగా పయనించని భాష మరణిస్తుంది .
    భాష పండితుల మెదళ్ళలో కాదు , జనబాహుళ్యం
    నాలుకలమీద జీవిస్తుంది . కవత్వాలూ , కాకరకాయలలో
    వికృతత్వం పాలైనా , ప్రజల వాడుకలో సహజ శుధ్ధంగా
    రాణిస్తూనే ఉంటుంది . పాపం బడుద్దాయిలు పండితులు
    తామే భాషను ఉధ్ధరిస్తున్నామనే భ్రమలో చెడబ్రతుకుతుం
    టారు . ఈ అమాయికులకు భాష నేర్పింది గ్రామీణులనే
    సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ! జనం ఉచ్చారణా వేగంలో
    రెండుపదాలు కలగలిసి మార్పుకు లోనౌతవి . ఈ మార్పు
    అలాగే ఉండదు . కానీ , మార్పును సూత్రబధ్ధంచేసి , ఇది
    ఇలానే ఉండాలంటాడు బడుధ్ధాయి . భాషాస్రోతస్విని ఆగదు .
    ప్రవహిస్తూనే ఉంటుంది . మార్పు సహజం . ఆ గ్రామీణుల
    ఆధారంగా భాష నేర్చుకుని , మార్పును గ్రహించే ఙ్ఞానం కొఱవడి
    జనం వాడుకను గ్రామ్యమంటాడు పండితమ్మన్యుడు . అసలు
    అమ్మభాష అలుసవుతోందంటే , ఈ అహంకారుల వల్లనే .
    ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి


  2. మార్పు సహజమయ్యా! ఈ
    కూర్పులు చేసెడు జిలేబి‌ కుహనా కిచిడీ
    చేర్పుల పండితులందురు
    నేర్పుగ భాషతమవలన నిలచెననుచు సూ :)

    ***

    గ్రామీణ ప్రజల నాలుక
    పై మించారునయ భాష ! పండితు లేమ
    న్నా మా మాటయి దే! ఈ
    సామాన్యులవల్లనే పసందై నిలచెన్ !

    ***

    ఓయమ! మన భాష బడు
    ద్దాయి చదువరులగు పండితమ్మన్యుల‌ మో
    చేయి యనుచిత ప్రవర్తన
    చే యీ కాలమున తాను చిక్కుల బడెనే !

    ***

    మన భాషాస్రోతస్విని
    తను మూలము గాంచె ప్రజల తరళపు నాల్కన్
    తనరారె జిలేబియగుచు
    జనాళి గ్రామ్యంపు సొంపు చక్కదనాలన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పద్యానువాదం , ధన్యవాదాలు .
      మరి , పండితమ్మన్యులు వింటారా ?
      వినరు గాక వినరు .
      పృషోదరాది ..... గూఢోత్మా పదబంధాలు వ్యాకరణ
      కార్యాలకు కట్టుబడవనీ , పెద్దలు ప్రయోగించారు గనుక
      యథాతథంగా గ్రహించమనీ మహర్షే ఘోషిస్తే , మన
      పండితుడు అతి సులభంగా పరిష్కరించేసి , చూస్కో
      నా మేథస్సు అనేశాడు . గతంలో , సమాసాల విషయంలోనూ
      ఇదే జరిగింది . అపండితులము , మనమేంచేస్తామ్ ?

      తొలగించండి