ఎనిమిదో తరగతి గదిలో పిల్లాడి ఏడ్పులూ , పెడబొబ్బలు .
ప్రక్క గదిలోని నేను
ప్రక్క గదిలోని నేను
పాఠం ఆపి , వరండాలోకి వచ్చి , కిటికీ లోంచి
చూశాను .
ఒక పిల్లాడు నేలమీద దొర్లుతూ పెడ బొబ్బలు
పెడ్తున్నాడు .
మా స్కూల్లో పిల్లలు కూర్చుందుకు ఏరూముకూ బల్లలు
లేవు .
టీచర్ వాడ్ని కాళ్ళతో తంతున్నాడు .
నేను వేగంగా గది గుమ్మం లోకి చేరుకున్నాను .
సార్ , అంటూ బిగ్గరగా గద్దించాను .
నన్ను ఊహించని అతడు సడన్ గా నావైపు తిరిగేడు .
రండిలా , అని మళ్ళీ గద్దించాను .
వచ్చాడు .
' ఏమిటి మీరు చేస్తున్నది?'
' హోంవర్కు చేయలేదు పైగా ఎదురు మాట్లాడు తున్నాడు
సార్ '
' అయితే?'
' అయితే ఏమిటి , దండించ నక్కరలేదా '
' దండించడమంటే పిళ్లాడ్ని కాళ్ళతో తన్నడమా '
నా స్వరంలో గౌరవం మారింది .
సంబోధనలో ఏకవచనం ప్రవేశించింది .
' ఎవరిచ్చారు నీకీ అధికారం'
' నీవసలు టీచరువేనా '
' టీచరు సంగతి సరే , నీవసలు మనిషివేనా '
నాకోపం తారా స్థాయికి చేరింది .
అక్కడ్నుంచి వెళ్ళి పొయ్యాడు .
అతడు చాలా జూనియర్ .
-----
ఈ
సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత నా వద్దకు
వచ్చాడు .
సారీ చెప్పాడు .
పిల్లలను కొట్టడం నేరమనీ , కార్పోరల్ పనిష్మెంట్
నిషేధించ బడిందనీ ,
ఒక్క ప్రధానోపాధ్యాయునికి మాత్రమే కేన్తో
అరచేతిపై మాత్రమే రెండు
చిన్న దెబ్బలు వేసే అధికారముందనీ , అదీ
ప్రవర్తనకు సంబందించి
మాత్రమే ననీ వివరించి ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించ
వద్దని చెప్పాను .
సదరు టీచర్ తదాదిగా నన్ను రోల్ మోడల్ గా
తీసుకున్నాడు . మంచి
టీచర్ గా పేరు గడించాడు .
-----
విద్యా సంస్థలలోనూ , వైద్యశాలలలోనూ పని చేసే
సిబ్బందికి ఉండవలసిన
మొదటి లక్షణం ఓర్పు . పురుషుల కంటే మహిళలకు ఓర్పు
అధికం అంటారు .
అందు వల్లనే నేమో పూర్వం ఈ రెండింటిలోనూ ఎక్కవగా
తీసుకునే వారు .
అసలీ టీచర్లు పిల్లల విషయంలో ఎందుకిలా
ప్రవర్తిస్తున్నారు ? పిల్లల విషయంలో
కక్ష – అనే పదానికే ఆస్కారం లేదు కదా . అల్లరి
చేయడం బాల్య చాపల్యం
కిందికి వస్తుంది . నిజమే , పిల్లలు విసిగిస్తారు
. అంతమాత్రాన , వాళ్ళు
పిల్లలు అనే విచక్షణ కోల్పోతే ఎలా ఈ టీచర్లు ?
ఆకట్టుకునే బోధనా చాతుర్యం , బోధనానుభవం ఉన్న
ఉపాధ్యాయుణ్ణి
విద్యార్ధులు అమితంగా ఇష్ట పడుతారు . ఆ సార్
క్లాస్ రూంకు వస్తున్నాడంటే
విద్యార్థుల ఉత్సాహం పురి విప్పి నాట్యం
చేస్తుంది .
తరగతి గది లోకి వస్తూనే , పాఠ్యాంశానికి సంబంధం
న్నా , లేకున్నా
ఒక క్రొత్త విషయాన్ని తీసుకొచ్చి ఆసక్తి కరంగా
వినిపించి పిల్లల మస్తిష్కాలను
తన బోధన వైపు మళ్ళించు కుంటాడు , మంచి
ఉపాధ్యాయుడు . అతని బోధన
ఆసాంతం జీవ కళ ఉట్టి పడుతూ కొన సాగుతుంది .
ఉపాధ్యాయునిలోని ఈ
సామర్ధ్యం అతన్ని విద్యార్ధులకు దగ్గరగా చేర్చి ,
ఒజ్జలలో మణిపూసగా
నిలుపుతుంది . ఉపాధ్యాయునిలో దాగి ఒక సహజ నటుడుండాలి
.
అవసరమైనప్పుడు ఆడాలి , పాడాలి . ఉపాధ్యాయుడు ఒక
సజీవ విజ్ఞాన
సర్వస్వం కావాలి . ఇతనికి తెలియని విషయమంటూ లేదని
అనిపించుకోవాలి .
ఉపాధ్యాయునికి సునిసిత పరిశీలనా జ్ఞానముండాలి .
డే టు డే క్రొత్త విషయాలను
నేర్చుకుంటూ అప్ డేటెడ్ గా ఉండాలి . ఉపాధ్యాయుడు
నిరంతర విద్యార్ధి .
-----
అన్నింటి కంటే , పిల్లల యెడ ప్రేమ దయ ఉండాలి .
నిరంతరం విద్యార్ధులకు
మార్గదర్శనం చేస్తూ ఉండాలి . క్లాస్ రూంలో
పిల్లాడి వెనుకబాటు తనానికి
ఒక్కొక్కప్పుడు అతని కుటుంబ స్థితి గతులు ,
పరిసరాలు కారణంకావచ్చు .
వాడి స్థితి గతులతో నాకేమిటి అనుకునే వాడసలు
ఉపాధ్యాయుడే కాదు .
దయామయుడైన ఉపాధ్యాయుడు దండించడం మాని , కారణాన్ని
అన్వేషిస్తాడు .
సమస్యను సాధ్యమైనంతలో చక్కజేసి విద్యార్ధిని అధ్యయనోన్ముఖున్ని
చేస్తాడు .
ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తులకంటే భిన్నమైనది .
అందుకే,అత్యున్నత స్థాయికి
చేరుకున్నాక కూడా తనకు చదువు చెప్పిన టీచరుకు
నమస్కరిస్తాడు విద్యార్థి .
ఈ గౌరవం సమాజంలో ఒక్క ఉపాధ్యాయుడికే లభిస్తుంది.మరి దాన్నికాపాడుకో
వాలంటే నిబధ్ధత ఉండాలిగా .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి