సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, జూన్ 2018, గురువారం

సంఘటితం కండి - 2


తెలుగుల సాంస్కృతీ విభవ దీప్తులు - కాపుల శౌర్య విక్రమో
జ్జ్వల ఘన కీర్తి జన్యములు - సంగర రంగము నందుగాని , శ్రీ
విలసిత కాంతిమత్ విపణి వీధుల యందున గాని , వేష భా
షల లలితేందిరా కళల చాయల గాని , చరిత్ర గాంచినన్ .

కుజన రాజన్యుల కుత్తుకల్ గోసిరి
రాయల సంగ్రామ రాజియందు
మణి మయ భూషణ వణిజులై వెలిగిరి
దేశ దేశాల సందీప్తి మెరయ
వేష భాషల కీర్తి వెలుగొంద నిలిపిరి
సాంస్కృతీ వైభవోజ్జ్వలత గదుర
పేద సాదల కింత పెట్టిరి కడుపార
దాన దయా గుణ జ్ఞాను లగుట

శౌర్య విక్రమ ధిషణాది చతురతలును ,
వేష భాషలు , సంస్కృతీ విభవములును
కాపు వర్గాల పెన్నిథుల్ , కలసి రండు ,
సంగరము సేయ , ఎన్నిక రంగ మందు .


1 వ్యాఖ్య: 1. కాపులార లెండు కలసి రండు విజయ
  మందు కొనగ నాంధ్ర మాత సంత
  సింప చేవ గల్గి సింహము లై రండు
  రావు గారి పిలుపు రాజిలగను

  జిలేబి
  చంద్రన్న కే సవాల్ :)

  ప్రత్యుత్తరంతొలగించు